Kangana Ranaut: నా ప్రైవేట్ పార్ట్స్ పై చేతులేసేవాడు.. కంగనా రనౌత్ మరో సంచలనం..!

హీరో హృతిక్ రోషన్ తో ఆమెకు సుదీర్ఘ కాలం వివాదం నడిచింది. ఇదిలా ఉంటే 2018లో హృతిక్ రోషన్ దర్శకుడు వికాల్ బాల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.

Written By: Shiva, Updated On : August 4, 2023 3:28 pm

Kangana Ranaut

Follow us on

Kangana Ranaut: కంగనా రనౌత్ విషయం ఏదైనా కుండబద్దలు కొడతారు. హిందీ పరిశ్రమలో స్టార్ గా ఎదిగిన కంగనా రనౌత్ అక్కడి పెద్దవాళ్ళ తీరును ప్రశ్నించారు. ముఖ్యంగా ఆమె నెపోటిజంకి వ్యతిరేకి. బాలీవుడ్ లో పాతుకుపోయిన ఓ మాఫియా వారి వారసుల కోసం అవుట్ సైడర్స్ ని తొక్కేస్తారని ఆమె ఆరోపిస్తూ ఉంటారు. సుశాంత్ సింగ్ రాజ్ మరణం అనంతరం కంగనా పోరాటం మరింత ఉధృతమైంది. అలాగే కంగనా పలుమార్లు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. తాను కొందరు హీరోలతో డేటింగ్ చేసినట్లు ఒప్పుకున్నారు.

హీరో హృతిక్ రోషన్ తో ఆమెకు సుదీర్ఘ కాలం వివాదం నడిచింది. ఇదిలా ఉంటే 2018లో హృతిక్ రోషన్ దర్శకుడు వికాల్ బాల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. వికాస్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కోగా ప్రత్యర్థులకు ఆమె మద్దతు ఇచ్చారు. వికాల్ బాల్ అలాంటి వాడే. నిజంగా లైంగిక వేధింపులకు పాల్పడే ఉంటాడని ఆమె కామెంట్స్ చేశారు. క్వీన్ మూవీ షూటింగ్ సమయంలో తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు.

పలకరింపుగా కౌగిలించుకుంటే గట్టిగా ఊపిరి ఆడనంతగా చేతులు బిగించేవాడు. తన తల నా భుజాల మీదకు వాల్చి జుట్టు, శరీరాన్ని వాసన చూసేవాడు. ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులు వేశాడు, అన్నారు. ఆయనకు పెళ్లి భార్య ఉన్నప్పటికీ పరాయి స్త్రీలతో శృంగారం చేయాలని కోరుకునేవాడు. అతనికి అది ఒక వ్యసనంగా మారిపోయిందని కంగనా రనౌత్ తీవ్ర ఆరోపణలు చేసింది.

2013లో విడుదలైన క్వీన్ మూవీలో కంగనా నటించింది. ఈ చిత్రానికి వికాస్ బాల్ దర్శకుడిగా ఉన్నారు. కంగనా కెరీర్లో క్వీన్ భారీ విజయం సాధించింది. ఆమెకు కెరీర్ కి ప్లస్ అయ్యింది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించాడు. ఇటీవల దర్శక నిర్మాత కరణ్ జోహార్ పై కూడా కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు. ఆయన నిర్మించిన రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ చెత్త మూవీ, నువ్వు సినిమాలు తీయడం మానేసి ఇంట్లో కూర్చో అని ఏకిపారేసింది.