Kangana Ranaut: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జుడిసియల్ కస్టడీలో ఉన్నాడు. అయితే కోర్టు ఈ రోజు బెయిల్ పిటిషన్ విచారణకు అంగీకరించింది కాబట్టి, అధికారులు అతన్ని విచారించనున్నారు. ఇక డ్రగ్స్ కేసులో బుక్ అయిన ఆర్యన్ ఖాన్ పై పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు అనవసరమైన ప్రేమను ఒలకబోస్తున్నారు.

ఆర్యన్ ఖాన్ ను కి హీరో హృతిక్ రోషన్ ఒక లెటర్ రాశాడు. “లైఫ్ లో ప్రతిదీ ఒక పాఠమే. జీవితంలో మనం ఊహించనివే ఎక్కువగా జరుగుతాయి. అంతమాత్రన అధైర్యపడాల్సిన అవరం లేదు. నువ్వు త్వరలోనే ఈ సమస్య నుంచి ధైర్యంగా బయటపడగలవు. బయటకు వచ్చాక నిజమైన హీరోగా నిలబడుతావు’ అంటూ డ్రగ్స్ మత్తులో చిక్కుకున్న బడా బాబుకు ధైర్య వచనాలను చెప్పుకొచ్చాడు హృతిక్.
హృతిక్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ పోస్ట్ పెట్టాడు. ఐతే, వివాదల రాణి కంగనా తన మాజీ ప్రియుడు గురించి ఘాటుగా స్పందించింది. ‘వచ్చాడు అండి. ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా మాఫియా బాబు దిగాడు’ అంటూ హృతిక్ పై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ పెట్టింది కంగనా. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తల్లి పూజా భట్ ‘ఆర్యన్ ఖాన్ నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఈ సమయం కూడా గడిచిపోతుంది’ అంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టింది.
అలాగే మాజీ హీరోయిన్ సుచిత్ర కృష్ణమూర్తి కూడా ‘ఆర్యన్ దగ్గర ఏం దొరకలేదు. ఏది ప్రూవ్ అవ్వలేదు’ అంటూ రాసుకొచ్చింది. ఫేడ్ అవుట్ హీరో సునీల్ శెట్టి కూడా పోస్ట్ చేస్తూ.. ‘ఆర్యన్ చిన్న పిల్లాడు. అతనికి కొంచెం ఊపిరి ఆడనివ్వండి’ అంటూ మెసేజ్ చేశాడు. మొత్తానికి డ్రగ్స్ తీసుకుని అడ్డంగా బుక్ ఈ కుర్రాడికి మద్దతులు ఇస్తున్నారు,
అందుకే, కంగనా మెసేజ్ పెడుతూ.. ‘మనం తప్పులు చేస్తాం. వాటిని సరిద్దికోవాలి. కానీ వాటిని గొప్పగా చూపొద్దు. ఆర్యన్ చేసిన దాని గురించి మాట్లాడను కానీ అతను ఏ తప్పు చెయ్యలేదు అనుకునేలా ఒక భ్రమ కల్పించొద్దు’ అంటూ అని కామెంట్స్ పెట్టింది.