https://oktelugu.com/

Naga Chaitanya: నిర్మాణంలో కమల్.. ఇంట్రెస్టింగ్ సంగతులు చెప్పిన చైతు !

Naga Chaitanya: యూనివర్సల్ హీరో కమల్‌ హాసన్ లో హీరోనే కాదు, మంచి నిర్మాత కూడా ఉన్నాడు. ఐతే.. సంక్రాంతి పండుగ సందర్భంగా కమల్ నుంచీ కీలక ప్రకటన వచ్చింది. శివ కార్తికేయ నటించే తదుపరి సినిమాను కమల్‌హాసన్ నిర్మించబోతున్నాడు. సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్‌ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. అన్నట్టు ఈ సినిమాను రాజ్‌కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేయబోతున్నాడు. రాజ్‌కుమార్ పెరియస్వామి మంచి టాలెంట్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 16, 2022 / 11:47 AM IST

    Naga Chaitanya

    Follow us on

    Naga Chaitanya: యూనివర్సల్ హీరో కమల్‌ హాసన్ లో హీరోనే కాదు, మంచి నిర్మాత కూడా ఉన్నాడు. ఐతే.. సంక్రాంతి పండుగ సందర్భంగా కమల్ నుంచీ కీలక ప్రకటన వచ్చింది. శివ కార్తికేయ నటించే తదుపరి సినిమాను కమల్‌హాసన్ నిర్మించబోతున్నాడు. సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్‌ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. అన్నట్టు ఈ సినిమాను రాజ్‌కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేయబోతున్నాడు. రాజ్‌కుమార్ పెరియస్వామి మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్.

    Naga Chaitanya

    రాజ్‌ కుమార్ పెరియస్వామి టేకింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. పైగా అతనిలో మంచి విజన్ ఉన్న డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఇక బడ్జెట్ విషయంలో కూడా రాజ్ కుమార్ చాలా ముందుచూపుతో ఉంటాడు. ఎక్కడా ఓవర్ బడ్జెట్ చెయ్యడు. ఏ రకంగా చూసుకున్నా.. రాజ్ కుమార్ తో ఈ ప్రాజెక్ట్ చేయడం మంచి నిర్ణయమే. బంగార్రాజు సినిమా షూటింగ్‌లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతు బయట పెట్టాడు.

    Also Read: కరోనా ఎఫెక్ట్: స్కూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    చైతు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా షూటింగ్ చేసే క్రమంలో నాన్న నన్ను డామినేట్ చేసిన ఫీలింగ్ కలిగింది నాకు.
    నిజానికి ‘బంగార్రాజు సినిమా ప్రకటించినప్పుడే సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. పైగా డాడీ నేను కలిసి నటిస్తున్నాం, కాబట్టి అంచనాలు రెట్టింపు అవుతాయని నాకు తెలుసు. అందుకే.. నాకు మొదటి నుంచీ ఈ సినిమా పై బాగా నమ్మకం ఉంది. మేము బడ్జెట్ విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ కాలేదు. అయితే, ఈ సినిమాలో నాకు పర్సనల్ గా నా పాత్ర బాగా కనెక్ట్ అయింది.

    చైతు ఇంకా మాట్లాడుతూ.. కాకపోతే.. ఈ సినిమా చేయడం నాకు సవాల్‌గా అనిపించింది. కారణం.. ఈ సినిమాలో ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉంది. అలాగే నాది పూర్తిగా ఎనర్జిటిక్ పాత్ర. నా కెరీర్ లోనే నేను ఇంతవరకు ఇలాంటి పాత్ర చేయలేదు. అయితే, ఈ సినిమాలో నా యాక్టింగ్ కి చాలా మంచి పేరు వచ్చింది. దానికి ముఖ్య కారణం.. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు’ అని చైతు చెప్పుకొచ్చాడు.

    Also Read:జేఎన్టీయూ పరీక్షలన్నీ వాయిదా.. క్లాసులన్నీ ఆన్‌లైన్‌లోనే.. ఎప్ప‌టి దాకా అంటే..?

    Tags