https://oktelugu.com/

Acharya: మెగా ఫ్యాన్స్ కి గుడ్ నెస్.. ఆచార్య రిలీజ్ ఎప్పుడంటే.. ?

Acharya: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆచార్య రిలీజ్ డేట్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని మొదట ఫిబ్రవరి 4న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. దాంతో మెగా ఫ్యాన్స్ బాగా నిరూత్సహ పడ్డారు. మెగా అభిమానుల నిరుత్సాహాన్ని గమనించిన మేకర్స్.. మొత్తానికి వాళ్లను హ్యాపీ చేయడానికి సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసింది. ఇంతకీ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 16, 2022 / 11:39 AM IST

    Megastar Chiranjeevi Acharya Release Date

    Follow us on

    Acharya: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆచార్య రిలీజ్ డేట్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని మొదట ఫిబ్రవరి 4న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. దాంతో మెగా ఫ్యాన్స్ బాగా నిరూత్సహ పడ్డారు. మెగా అభిమానుల నిరుత్సాహాన్ని గమనించిన మేకర్స్.. మొత్తానికి వాళ్లను హ్యాపీ చేయడానికి సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసింది.

    Acharya

    ఇంతకీ ‘ఆచార్య’ కొత్త రిలీజ్‌ డేట్‌ ఏమిటో తెలుసా ? ఏప్రిల్‌ 1.ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి కరోనా మూడో వేవ్ ఎఫెక్ట్ కు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ వంటి భారీ సినిమాలు మళ్ళీ వాయిదా వైపు అడుగులు వేశాయి. అలాగే, ఈ కోవిడ్ ఎఫెక్ట్ చిత్రాల్లో ఆచార్య కూడా పోస్ట్ ఫోన్ అయింది. ఇప్పటికే ఈ చిత్రం గత మూడేళ్ళ నుంచి ప్రొడక్షన్ దశలోనే కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ సినిమా మొదలు పెట్టాక, రెండు సార్లు కోవిడ్ వేవ్స్ వచ్చి వెళ్లాయి.

    Also Read: జేఎన్టీయూ పరీక్షలన్నీ వాయిదా.. క్లాసులన్నీ ఆన్‌లైన్‌లోనే.. ఎప్ప‌టి దాకా అంటే..?

    కాగా ఇప్పుడు మూడో వేవ్ కూడా వచ్చింది. నిజానికి ఓ దశలో ఆచార్యను అనుకున్న డేట్ ప్రకారమే ఫిబ్రవరి 4న రిలీజ్ చేయాలని టీమ్ ప్రయత్నాలు చేశారు. అయితే, చాలా రాష్ట్రాలలో థియేటర్లు కూడా మూతబడ్డాయి. వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ అంటూ ఇప్పటికే ప్రభుత్వాలు ఆదేశాలు కూడా జారీ చేశాయి. అందుకే, ఆచార్య విడుదల వాయిదా ఖాయం అయింది. ఏది ఏమైనా ఈ కరోనా మూడో వేవ్ దెబ్బ కారణంగా భారీ సినిమాలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది.

    కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.

    Also Read:కరోనా ఎఫెక్ట్: స్కూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    Tags