https://oktelugu.com/

HBD kamal: పుట్టిన రోజు కమల్​ ఎమోషనల్​ పోస్ట్​.. తనకు అసలైన బహుమతి ఇదేనంటూ ట్వీట్​!

HBD kamal: ఇండియన్​ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది.. విభిన్న కథాంశంతో ప్రేక్షకులను పలకరించి లోకనాయకుడిగా అభిమానుల నుంచి బిరుదు పొందిన నటుడు కమల్​ హాసన్​. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, ఆయన హీరోగా నటిస్తోన్న విక్రమ్​ సినిమా నుంచి అదిరిపోయే టీజర్​ గ్లింప్స్​ను చిత్ర యూనిట్​ నిన్న సాయంత్రం విడుదల చేసింది. దీనిపై నెట్టింట […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 7, 2021 / 12:22 PM IST
    Follow us on

    HBD kamal: ఇండియన్​ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది.. విభిన్న కథాంశంతో ప్రేక్షకులను పలకరించి లోకనాయకుడిగా అభిమానుల నుంచి బిరుదు పొందిన నటుడు కమల్​ హాసన్​. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, ఆయన హీరోగా నటిస్తోన్న విక్రమ్​ సినిమా నుంచి అదిరిపోయే టీజర్​ గ్లింప్స్​ను చిత్ర యూనిట్​ నిన్న సాయంత్రం విడుదల చేసింది. దీనిపై నెట్టింట భారీ రెస్పాన్స్ వచ్చింది.

    కాగా, ఆయను విషెస్​ చెబుతునన్న వారి నుంచి తాను ఇది కోరుకోవడం లేదని సోషల్​ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమల్​. ప్రస్తుతం దేశంలో ప్రతి ఒక్కరూ వరదలతో బాధపడుతున్నారని వారికి, పేద ప్రజలకు వీలైనంత సాయం చేయమని కోరారు. అలా చేయమే తనకు అతిపెద్ద బర్త్​డే గిఫ్ట్​ అంటూ కమల్​ ఎమోషనల్​ పోస్ట్​ చేశారు. దీంతో కమల్​పై అందరికీ మరింత గౌరవం పెరిగింది.

    విశ్వరూపం, ఉత్తమ విలన్​, దశావతారం వంటి విలక్షణమైన సినిమాలు ఎంచుకుని.. విభిన్న పాత్రల్లో నటించారు కమల్​. ఆయన చేసిన ప్రతి సినిమాలో దేశ గౌరవాన్ని చాటేలా ఏదో ఒక సీన్​ ఉండేలా చూస్తుంటారు. కాగా, తాజాగా కమల్​ నటించిన విక్రమ్​ సినిమా నుంచి విడుదలైన గ్లింప్​ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.