Major Movie Collections: సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా అడవి శేష్ ని హీరో గా పెట్టి తీసిన మేజర్ అనే సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..26 /11 ముంబై దాడుల్లో ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని చేసిన ఈ మూవీ కి దేశం నలుమూలల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది..ఉన్ని కృష్ణన్ గా అడవి శేష్ నటన ప్రతి ప్రేక్షకుడి మదిలో చిరస్థాయిగా గుర్తు ఉండిపోతుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ముఖ్యంగా చివరి 40 నిమిషాలు మాత్రం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేసాడు అడవి శేష్..ఇటీవల విడుదల అయినా సినిమాలలో ఈ స్థాయి ప్రశంసలు అందుకున్న ఏకైక సినిమా ఇదే..అంతతి రెస్పాన్స్ ని సాధించిన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు కూడా అదిరిపోయాయి..ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఈ సినిమా విడుదల కి ముందు నుండే భారీ హైప్ ని సంపాదించుకుంది..అలా ఈ స్థాయిలో హైప్ రావడానికి ముఖ్య కారణాలలో ఒక్కటి ఈ సినిమాకి నిర్మాత సూపర్ స్టార్ మహేష్ బాబు కావడం ఒక్కటి అయితే , టీజర్ మరియు ట్రైలర్స్ తో సినిమా పై ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేపడం మరొక్కటి ..ఇవి రెండు కాకుండా ఈ సినిమా కి ఇంత హైప్ రావడానికి కారణాలలో మరొక్కరు అడవి శేష్.ఆయన హీరో గా చేసిన గత చిత్రాలు అన్ని కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా కమర్షియల్ పరంగా కూడా భారీ సక్సెస్ లు సాధించాయి..ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ హీరో రేంజ్ లో జరిగాయి..ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే మొదటి రోజు టికెట్ ముక్క కూడా దొరకలేదు అంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..నైజం ప్రాంతం లో ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా దుమ్ము లేపేసింది అనే చెప్పాలి..కేవలం ఈ ఒక్క ప్రాంతం నుండే ఈ సినిమా కి దాదాపుగా 3.50 కోట్ల రూపాయిల నుండి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
Also Read: Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ని దారుణంగా మోసం చేసిన యంగ్ హీరో
ఇక ఆంధ్ర లో అయితే ఈ సినిమాకి సీడెడ్ నుండి ఉత్తరాంధ్ర వరుకు ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి..తెలంగాణ కాకుండా కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుండి ఈ సినిమా దాదాపుగా 4 రూపాయలకు పైగా షేర్ ని సాధించింది అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి దాదాపుగా 8 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది అని తెలుస్తుంది..ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి ప్రీమియర్స్ షోస్ నుండే అద్భుతమైన ఓపెనింగ్ దక్కింది అనే చెప్పాలి..270 కి పైగా లొకేషన్స్ లో విడుదల అయిన ఈ సినిమా 2 లక్షల 70 వేల డాలర్స్ ని సొంతం చేసుకుంది..మీడియం బడ్జెట్ సినిమాలకు ఈ స్థాయి ఓపెనింగ్ అంటే మాములు విషయం కాదు..మొత్తం మీద ప్రీమియర్స్ + డే 1 కలిపి ఈ సినిమాకి USA లో 5 లక్షల డాలర్లు వచ్చాయి..వీకెండ్ పూర్తి అయ్యేసరికి ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్కుని కూడా దాటేస్తుంది అని అంచనా..ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 13 కోట్ల రూపాయలకు జరిగింది..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని చూస్తూ ఉంటె ఈ సినిమా మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా షేర్ ని సాధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది..అంటే వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడమే కాకుండా..భారీ లాభాలు కూడా తెచ్చిపెట్టింది అన్నమాట..ఈ స్థాయి