Vikram Movie Collections: కమల్ హాసన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విక్రమ్ ఏకంగా కెజిఫ్ 2 రికార్డు బ్రేక్ చేసింది. ఈ మూవీ బాహుబలి 2 రికార్డుపై కన్నేసింది. కమల్ హాసన్ విక్రమ్ మూవీతో నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ ఈ మూవీ రూ. 316 గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి ఈ మూవీ రూ. 210 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా తమిళనాడులో విక్రమ్ ఏకంగా కెజిఎఫ్ 2 రికార్డు బ్రేక్ చేసింది. కెజిఎఫ్ 2 తమిళ్ వెర్షన్ అక్కడ రూ. 100 కోట్ల వసూళ్లు అందుకుంది. ఈ రికార్డుని విక్రమ్ బ్రేక్ చేసింది. తమిళనాడులో విక్రమ్ వసూళ్లు రూ. 130 కోట్లకు చేరాయి.

ఈ క్రమంలో బాహుబలి 2 రికార్డుపై విక్రమ్ కన్నేసింది. బాహుబలి 2 తమిళ్ వెర్షన్ అక్కడ రూ. 150 కోట్ల వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుండగా బాహుబలి రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. ఇక 2022కి గాను విక్రమ్ కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. తెలుగులో కేవలం రూ. 7 కోట్లకు థియేట్రికల్ హక్కులు విక్రయించారు. ఇప్పటి వరకు విక్రమ్ ఏపీ / తెలంగాణాలలో రూ. 13. 87 కోట్ల షేర్, 26.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కర్ణాటక, కేరళలో పాటు ఓవర్సీస్ లో విక్రమ్ రికార్డు వసూళ్లు రాబడుతుంది.
Also Read: South India sentiment- BJP: మళ్లీ సౌత్ ఇండియా సెంటిమెంట్.. బీజేపీకి గండమే

విక్రమ్ వరల్డ్ వైడ్ రన్ ముగిసేనాటికి రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో రివేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయగా, ఫహద్ ఫాజిల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో అలరించారు. ఇక సూర్య గెస్ట్ రోల్ చేయగా అద్భుతం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం చిత్రానికి ప్లస్ అయ్యింది. విక్రమ్ విజయంలో బీజీఎం కీలక రోల్ పోషించింది.
Also Read:Aruguru Pativratalu Movie Fame Amrutha: ఆరుగురు పతివ్రతలు హీరోయిన్ ఇప్పటి పరిస్థితి ఇదీ