Kamal Haasan On Vikram Box Office Success: విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ నేపథ్యంలో కమల్ హాసన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ ద్వారా వచ్చిన డబ్బులతో నా లోన్స్ అన్ని తిరిగి చెల్లించేస్తా అన్నారు. విక్రమ్ సక్సెస్ కమల్ హాసన్ ని ఆనందంలో లో ముంచెత్తుతుంది. విక్రమ్ సినిమాకు నిర్మాతగా కూడా ఉన్న కమల్ హాసన్.. భారీగా లాభాలు పొందారు. మూడవ వారం కూడా విక్రమ్ బాక్సాఫీస్ జోరు తగ్గలేదు. ఇప్పటికే ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. రన్ ముగిసే నాటికి విక్రమ్ రూ. 350 నుండి 400 కోట్ల వసూళ్లు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ ఎదగాలని నేను కోరుకుంటాను. వాళ్ళకు డబ్బులు గురించి చింతలేని నాయకుడు కావాలి. ఒక్క క్షణంలో నేను రూ. 300 కోట్లు సంపాదించగలను అంటే ఎవరూ నమ్మరు. కానీ ఇప్పుడు అది జరిగింది. ఈ డబ్బులతో ముందు నా లోన్స్ తీర్చేస్తాను. ప్రశాంతంగా నచ్చింది తింటాను , తాగుతాను. నా కుటుంబానికి, మిత్రులకు ఏమి ఇవ్వగలనో అంతా ఇస్తాను. ఇతరులకు సహాయం చేయడంలో వెనుకాడను. నాకు బిరుదులు అవసరం లేదు. మంచి మనిషిన్న పేరు చాలు, అన్నారు.
Also Read: RRR Movie- Larry Karaszewski: సినిమా చచ్చిపోయింది అనేవాళ్ళు RRR చూడండి అంటున్న హాలీవుడ్ రైటర్
జయాపజయాలు ఆలోచించకుండా, కమర్షియల్ లెక్కలు వేయకుండా కమల్ తన బ్యానర్ లో చాలా సినిమాలు చేశారు. వాటిలో విజయం సాధించిన చిత్రాలు చాలా తక్కువ. ఇక కమల్ హాసన్ ఓ బ్లాక్ బస్టర్ అందుకొని ఏళ్ళు గడచిపోయింది. దశాబ్దాల తర్వాత విక్రమ్ మూవీతో కమల్ హాసన్ ఓ భారీ కమర్షియల్ హిట్ దక్కించుకున్నాడు. ఇక ఆయన చెప్పినట్లుగా విక్రమ్ లాభాలు బహుమతుల రూపంలో పనిచేస్తున్నారు.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి ఖరీదైన లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన కమల్, సూర్యకు రోలెక్స్ వాచ్ బహోకరించారు. ఆ చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్స్ కి బైక్స్ ఇవ్వడం జరిగింది. డ్రగ్ మాఫియా నేపథ్యంలో రివేంజ్ యాక్షన్ డ్రామాగా విక్రమ్ తెరకెక్కింది. విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయగా.. ఫహద్ ఫాజిల్ పోలీస్ అధికారిగా కనిపించారు. విక్రమ్ సీక్వెల్ దర్శకుడు ప్రకటించగా క్రేజీ వార్తలు బయటికి వస్తున్నాయి.
Also Read:Sai Pallavi Craze: సాయి పల్లవి అంటే అందరికీ ఎందుకు అంత అభిమానం?
Recommended Videos