Kamal Haasan LIK Movie Exit Reason: వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) , రీసెంట్ గానే ‘LIK’ చిత్రం తో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టాక్ డివైడ్ గానే వచ్చింది , కానీ కలెక్షన్స్ మాత్రం ఆగడం లేదు. ప్రదీప్ బ్రాండ్ ఇమేజ్ కారణంగా యూత్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి చూసేస్తున్నారు. ఫలితంగా మొదటి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 60 శాతానికి పైగా రీకవరీ ని సొంతం చేసుకుంది. ఈ వీకెండ్ కూడా మంచి రన్ ఉండే అవకాశం ఉండడం తో, కచ్చితంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను డైరెక్టర్ విగ్నేష్ శివన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘ముందుగా ఈ ప్రాజెక్ట్ ని కమల్ హాసన్ గారి ప్రొడక్షన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పై తెరకెక్కించడానికి సంతకం చేశాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల , ఈ సినిమా 10 నెలల వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు. దీంతో కమల్ హాసన్ సార్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు, ఆ తర్వాత 7 స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. ఒక్క షెడ్యూల్ పూర్తి అయ్యాక ఓటీటీ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ముందుగా ఈ చిత్రాన్ని 210 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నాము. కానీ అది ఆ తర్వాత 150 కోట్లకు కుదించాల్సి వచ్చింది, ఇంకా కొన్ని రోజులు అయ్యాక 100 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ కి కుదించాల్సి వచ్చింది’.
‘ఒక పాయింట్ దగ్గర అయితే ఈ సినిమాకు లలిత్ సార్ బడ్జెట్ కేటాయించలేకపోయాడు. ఆ సమయం లో నా సతీమణి నయనతార ఈ చిత్రం నిర్మాణానికి డబ్బులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అప్పుడే ఒక సినిమాలో నటించడానికి అడ్వాన్స్ తీసుకుంది , ఆ డబ్బులనే LIK సినిమాకు పెట్టింది. క్వాలిటీ విషయం లో అసలు వెనక్కి తగ్గకండి , ఎంత ఖర్చు అయినా పర్వాలేదు , చూసుకుందాం అని నాకు నయనతార ధైర్యం చెప్పింది. అలా చాలా మంది ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఎంతో సహకరించారు’ అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా కంటెంట్ పరంగా మధ్యలో కాస్త గందరగోళానికి గురైనప్పటికీ, క్వాలిటీ మాత్రం అదిరిపోయింది అంటూ విమర్శకులు కూడా మెచ్చుకోవడానికి కారణం ఇదే. అదృష్టం కొద్దీ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వైపు దూసుకుపోతుంది, ఫైనల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి.
