Homeఎంటర్టైన్మెంట్Bimbisara: OTT చరిత్రలో సెన్సషనల్ రికార్డు ని నెలకొల్పిన కళ్యాణ్ రామ్ 'భింబిసారా' చిత్రం

Bimbisara: OTT చరిత్రలో సెన్సషనల్ రికార్డు ని నెలకొల్పిన కళ్యాణ్ రామ్ ‘భింబిసారా’ చిత్రం

Bimbisara: తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన సంక్షోభం ని ఎదురుకుంటున్న సమయం లో, ఇండస్ట్రీ లో సరికొత్త ఆశలు చిగురించేలా చేసిన చిత్రం ‘భింబిసారా’..కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది..ఓపెనింగ్స్ దగ్గర నుండి లాంగ్ రన్ వరుకు ఎక్కడా తగ్గకుండా ఆడిన ఈ చిత్రం ఫుల్ రన్ లో సుమారు 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..సినిమాలో దమ్ము ఉంటె ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు అని చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది ఈ చిత్రం.

Bimbisara
Bimbisara

అంతే కాకుండా ఒక నటుడిగా మరియు నిర్మాతగా కళ్యాణ్ రామ్ ని ఈ సినిమా నిలదొకక్కుకునేలా చేసింది..నిర్మాతగా నష్టాల్లో ఉన్న కళ్యాణ్ రామ్, రిస్క్ చేసి తన మార్కెట్ కి మించి బడ్జెట్ ని పెట్టాడు..పెట్టిన బడ్జెట్ కి రెండింతలు లాభాలు వచ్చాయి..బాక్స్ ఆఫీస్ వద్ద అంతతి ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఇటీవలే OTT లో విడుదలైంది.

ఎప్పుడెప్పుడు OTT లో విడుదల అవుతుందా అని ఎదురు చూసిన ప్రేక్షకుల కోసం జీ5 వారు అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేసారు..థియేటర్ లో ఈ సినిమాకి ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో OTT లో కూడా అంతకు మించి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..కేవలం 24 గంటల్లోనే ఈ సినిమాకి రెండు మిలియన్ల వ్వాచ్ హావర్స్ వచ్చాయి..ఇది వరుకు జీ తెలుగు లో కేవలం స్టార్ హీరో సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ వ్యూస్ వచ్చేవి..కానీ మొదటిసారి ఒక మీడియం రేంజ్ హీరోకి ఈ స్థాయి వ్యూస్ రావడం OTT చరిత్ర లో ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు.

Bimbisara
Bimbisara

ఇంతటి ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రానికి పార్ట్ 2 అతి త్వరలోనే తెరకెక్కనుంది..పార్ట్ 1 కంటే ఎక్కువ బడ్జెట్ తో..భారీ తారాగణం తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు డైరెక్టర్ వసిష్ఠ..ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించే అవకాశాలు ఉన్నాయి..మన టాలీవుడ్ లో సీక్వెల్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో మన అందరికి తెలిసిందే..భింబిసారా సీక్వెల్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని ఆ చిత్ర యూనిట్ చాలా నమ్మకం తో ఉంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version