Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ కి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. కొత్తవాళ్లను ముఖ్యంగా కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడనే సాఫ్ట్ కార్నర్ ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి లాంటి కొంతమంది దర్శకుల్ని కళ్యాణ్ రామే పరిచయం చేశాడు. కానీ, ఇప్పుడిదే కళ్యాణ్ రామ్ కొత్త దర్శకులతో రిస్క్ చేయనంటున్నాడు.

ఇంతకీ కళ్యాణ్ రామ్ ఎందుకింత పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ? అసలు కళ్యాణ్ రామ్ వెర్షన్ ఏంటి ?. “డైరక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే, నిర్మాతను ఓనర్ ఆఫ్ ది షిప్ అనాలి. కళ్యాణ్ రామ్ సినిమాలకు ఆయనే నిర్మాత. కాబట్టి.. షిప్ మునిగిపోతే కెప్టెన్ కొత్తవాడు కాబట్టి, పోయేది ఏమి లేదు. అతను ఈజీగానే తప్పించుకుంటాడు. కానీ, ఓనర్ మాత్రం ఆర్థికంగా మునిగిపోతాడు. కళ్యాణ్ రామ్ చాలా సినిమాల విషయంలో ఇలాగే మునిగిపోయాడు.
ప్రాజెక్టు కరెక్ట్ గా వెళ్తుందా ? లేదా ? అనేది ప్రొడ్యూసరే చూసుకోవాలి. హీరోగా చేస్తూనే మరోపక్క నిర్మాతగా కళ్యాణ్ రామ్ చాలా కష్టపడతాడు. నిర్మాణ లెక్కల విషయంలో కూడా కళ్యాణ్ రామ్ ఎక్కడా బ్యాడ్ రిమార్క్ లేదు. అంత పర్ఫెక్ట్ గా కళ్యాణ్ రామ్ నిర్మాణం ఉంటుంది. ఐతే, అతి మంచితనం వల్ల.. చివరకు సినిమా ఇండస్ట్రీలో నష్టాలే మిగులుతాయి.

కళ్యాణ్ రామ్ పరిస్థితి అదే. దీనికితోడు కొత్త దర్శకుడితో సినిమా చేసేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. కథ విషయంలో కూడా ఇన్ వాల్వ్ అవ్వాల్సి వస్తోంది. బడ్జెట్ దాటకుండా ఉండాలి అంటే.. కొత్త దర్శకుడికి మొదటి రోజు నుంచి కూర్చోబెట్టి చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే, ఓవర్ బడ్జెట్ అయ్యే ప్రమాదం ఉంది. ఏ రకంగా చూసుకున్నా.. కొత్త వాళ్లతో సినిమా చేస్తే నష్టాలే ఎక్కువ.
Also Read: Anchor Sravanthi: ఓవర్ ఎక్స్ పోజింగ్ తో షాకిచ్చిన యాంకర్ స్రవంతి !
అందుకే, ఇక కొత్త దర్శకుల విషయంలో నేను రిస్క్ చేయను. చేయలేను అంటున్నాడు కళ్యాణ్ రామ్. పైగా సీనియర్ దర్శకులతో సినిమాలు చేసినప్పటికీ.. సీన్ టు సీన్ డిస్కస్ చేసిన తర్వాతే సెట్స్ పైకి వెళ్తాను అంటున్నాడు. మొత్తమ్మీద కొత్త దర్శకుల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటాను, అస్సలు రిస్క్ తీసుకోను’ అని కళ్యాణ్ రామ్ నోటి వెంట రావడం నిజంగా విశేషమే.
మొత్తానికి ఇలా కొత్త దర్శకుల్ని పరిచయం చేసే విషయంలో తన అభిప్రాయాన్ని కళ్యాణ్ రామ్ ఈ విధంగా బయటపెట్టాడు. భవిష్యత్తులో అయినా కళ్యాణ్ రామ్ కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తాడేమో చూడాలి.
Also Read: Celebrities Remembering Sr NTR: ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రముఖులు