https://oktelugu.com/

Kalki OTT Release: సెన్సేషనల్ కల్కి ఓటీటీలో… డేట్, ఫ్లాట్ ఫార్మ్ ఫిక్స్? ప్రభాస్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చే న్యూస్

Kalki OTT Release: దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ రికార్డు వసూళ్ల దిశగా అడుగులు వేస్తుంది. విడుదలై రెండు వారాలుగా ముగిసినా కల్కి సాలిడ్ వసూళ్లు రాబడుతుంది. ఇక నార్త్ ఇండియాలో ప్రభాస్ నాలుగో హిట్ నమోదు చేశాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 10, 2024 / 11:43 AM IST

    Kalki OTT Release Date

    Follow us on

    Kalki OTT: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2829 AD ఓటీటీ విడుదల తేదీ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిర్మాతలతో ఓటీటీ సంస్థ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. కల్కి స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటున్నారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం…

    దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ రికార్డు వసూళ్ల దిశగా అడుగులు వేస్తుంది. విడుదలై రెండు వారాలుగా ముగిసినా కల్కి సాలిడ్ వసూళ్లు రాబడుతుంది. ఇక నార్త్ ఇండియాలో ప్రభాస్ నాలుగో హిట్ నమోదు చేశాడు. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2, సాహో చిత్రాలు నార్త్ ఇండియాలో దుమ్మురేపాయి. తెలుగులో పరాజయం పాలైన సాహో హిందీలో విజయం సాధించడం విశేషం.

    కల్కి హిందీ వెర్షన్ రూ. 250 కోట్ల వసూళ్లకు దగ్గరైంది. అక్కడ కల్కి క్లీన్ హిట్ గా నిలిచింది. ఓవర్సీస్ లో కల్కి చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కుతుంది. యూఎస్ లో కల్కి వసూళ్లు $ 15 మిలియన్ దాటేశాయి. ఆర్ ఆర్ ఆర్ రికార్డు కల్కి బ్రేక్ చేసింది. ప్రభాస్ యూఎస్ లో ప్రభాస్ నాలుగుసార్లు వంద కోట్ల వసూళ్లు రాబట్టి టాలీవుడ్ లో ఎవరికీ అందని స్థాయిలో ఉన్నాడు.

    కాగా కల్కి ఓటీటీ విడుదల తేదీ ఇదే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కల్కి మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ భారీ ధర చెల్లించి దక్కించుకుంది. కల్కి విడుదలైన 7-8 వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు ఓటీటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారట. ఆ లెక్కన కల్కి ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15 నుండి ఓటీటీలో అందుబాటులోకి రానుందని టాలీవుడ్ వర్గాల అంచనా.

    కల్కి మూవీలో ప్రభాస్ భైరవగా అదరగొట్టాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ పాత్రను ఫన్నీ యాంగిల్ లో చెప్పారు. అలాగే ప్రభాస్ రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉండటం విశేషం. అమితాబ్ పాత్ర హీరోకి సమానంగా ఉంది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అదరగొట్టారు. ప్రభాస్-అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. కమల్ హాసన్, దీపికా పదుకొనె ఇతర ప్రధాన పాత్రలు చేశారు. దిశా పటాని, రాజేంద్రప్రసాద్, శోభన, పశుపతి ఇతర కీలక రోల్స్ చేశారు.