https://oktelugu.com/

Indian2 movie: ‘భారతీయుడు 2’కు గుడ్​బై చెప్పిన కాజల్!​

Indian2 movie: కమల్​హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్నసినిమా భారతీయుడు 2. వీరిద్దరి కాంబినేషన్​లో 1996లో వచ్చిన భారతీయుడు ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. కాగా, మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు శంకర్​. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ కూడా మొదలైంది. అయితే, షూటింగ్​ మధ్యలో అగ్ని ప్రమాదంలో కొదరు యూనిట్​ సభ్యులు మరణించడం.. కరోనా ముట్టడి వంటి సమస్యలు సినిమాను చుట్టుముట్టేశాయి. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 15, 2021 / 03:03 PM IST
    Follow us on

    Indian2 movie: కమల్​హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్నసినిమా భారతీయుడు 2. వీరిద్దరి కాంబినేషన్​లో 1996లో వచ్చిన భారతీయుడు ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. కాగా, మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు శంకర్​. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ కూడా మొదలైంది. అయితే, షూటింగ్​ మధ్యలో అగ్ని ప్రమాదంలో కొదరు యూనిట్​ సభ్యులు మరణించడం.. కరోనా ముట్టడి వంటి సమస్యలు సినిమాను చుట్టుముట్టేశాయి. ఆ తర్వాత దర్శక నిర్మాతలకు వచ్చిన మనస్పర్థల వల్ల హైకోర్డు వరకూ వెళ్లడంతో సినిమా షూటింగ్​ వాయిదా పడింది.

    ఈ సమస్యలన్నీ పోయి ఇక సినిమా మొదలవుతుందని అనుకుంటున్న తరుణంలో.. తాజాగా శంకర్​కు మరో సమస్య ఎదురైంది. ఈ సినిమాలో హీరోయిన్​గా కాజల్​ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం కాజల్​ షెడ్యూల్​ టైట్​గా ఉండటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె గర్భవతి కావడం వల్లే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై కాజల్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కాగా, కాజల్​ స్థానంలో త్రిషను రీప్లేస్​ చేయనున్నట్లు సమాచారం. మరి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

    మరోవైపు, చరణ్​ హీరోగా శంకర్ ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం ఇస్తున్నారు. దిల్​ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.