36వ పుట్టినరోజుకు ‘కాజల్’ కొత్త ప్రయోగం !

‘కాజల్ అగర్వాల్’ మైండ్ సెట్ మొత్తం మారిపోయినట్టు అనిపిస్తోంది. గ్లామరస్ హీరోయిన్ గా బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటినుండి తన లైఫ్ స్టైల్ ను మార్చుకుంది. మిడ్ నైట్ పార్టీలకు, డైరెక్టర్లతో టూర్ లు లాంటి అన్నిటినీ బంద్ చేసుకుంది. ఇప్పుడు సినిమాల ఎంపికలో కూడా కొత్తగా ఆలోచిస్తోంది. కథలు, క్యారెక్టర్ల విషయంలో ఈ హీరోయిన్ గతంలో చేయని విధంగా ప్రస్తుతం ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. నిజానికి కాజల్ కి […]

Written By: admin, Updated On : May 29, 2021 12:06 pm
Follow us on


‘కాజల్ అగర్వాల్’ మైండ్ సెట్ మొత్తం మారిపోయినట్టు అనిపిస్తోంది. గ్లామరస్ హీరోయిన్ గా బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటినుండి తన లైఫ్ స్టైల్ ను మార్చుకుంది. మిడ్ నైట్ పార్టీలకు, డైరెక్టర్లతో టూర్ లు లాంటి అన్నిటినీ బంద్ చేసుకుంది. ఇప్పుడు సినిమాల ఎంపికలో కూడా కొత్తగా ఆలోచిస్తోంది. కథలు, క్యారెక్టర్ల విషయంలో ఈ హీరోయిన్ గతంలో చేయని విధంగా ప్రస్తుతం ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది.

నిజానికి కాజల్ కి ఎప్పుడో ఇలాంటి సినిమాలు చేయమని ఆఫర్లు వచ్చాయి. కానీ, మొన్నటివరకు హీరోల సరసన గ్లామరస్ గా కనిపిస్తూ.. పాటలు-రొమాన్స్ కే పరిమితం అవ్వడానికి ఇష్టపడింది గానీ, ఎలాంటి ప్రయోగాలకు మొగ్గు చూపలేదు. పైగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చినా.. తనకి స్టార్ హీరోల సినిమాలే కావాలంటూ మొత్తానికి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ ల కోసం ఆరాటపడింది. కానీ ఇప్పుడు ఈ అమ్మడులో ఆ ఆరాటం తగ్గింది.

ఎలాగూ 36 ఏళ్ల వయసు వచ్చేసింది. మహా అయితే మరో నాలుగు ఏళ్ళు లైమ్ లేట్ లో ఉంటుంది. అందుకే కనీసం ఇప్పుడు అయినా తనలోని నటికి న్యాయం చేయాలని కాజల్ తాపత్రయం. అందుకే కొత్త క్యారెక్టర్లతో ప్రయోగాలు చేయాలనుకుంటోంది. త్వరలోనే ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి కాజల్ రంగం సిద్ధం చేసుకుంటుంది. జయశంకర్ దర్శకత్వంలో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇంతకీ ఈ జయ్ శంకర్ ఎవరంటే.. సంతోష్ శోభన్ హీరోగా గతంలో పేపర్ బాయ్ అనే సినిమా చేశాడు ఈ జయశంకర్. ఆ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా.. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో జయ్ శంకర్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎలాగోలా ఆ పరిస్థితులను దాటుకుని.. తాజాగా మరో ప్రయత్నంగా ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా చేయడానికి జయ్ శంకర్ కిందామీదా పడుతున్నాడు. జులై నుంచి సెట్స్ పైకి రానున్న ఈ సినిమాను కాజల్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారు.