Kajal Aggarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆమె తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని ఇష్టపడి వివాహం చేసుకుంది. 2020 అక్టోబర్ లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య ముగిసింది. అప్పుడు కరోనా ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో కాజల్ పరిశ్రమ పెద్దలను పిలవలేదు. కేవలం ఇరు కుటుంబాల బంధువులు హాజరయ్యారు. పెళ్ళైన వెంటనే కాజల్ ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. షూటింగ్స్ కూడా లేని పక్షంలో ఇదే రైట్ అని పిల్లల కోసం ప్రయత్నం చేశారు. 2022 ఏప్రిల్ లో కాజల్ కి అబ్బాయి పెట్టాడు.
కాజల్ కొడుకు పేరు నీల్ కిచ్లు. పెళ్లి తర్వాత కూడా నటిస్తున్నారు. ముందుగా ఒప్పుకున్న చిత్రాలతో పాటు గత రెండేళ్లలో కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారు. కాజల్ బాలకృష్ణకు జంటగా భగవంత్ కేసరి మూవీలో నటిస్తున్నారు. భగవంత్ కేసరి దసరా కానుకగా విడుదల కానుంది. అలాగే భారతీయుడు 2 చిత్రంలో నటిస్తుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నారు. 1996 బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి ఇది కొనసాగింపు.
కాజల్ మేనియా ఏమాత్రం తగ్గలేదు. అడపాదడపా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే కాజల్ నటనకు పూర్తిగా దూరం కావాలనుకుంటున్నారట. కెరీర్ సక్సెస్ ట్రాక్ లో పరుగెత్తుతుండగా ఆమె అనూహ్య నిర్ణయం తీసుకున్నారట. కాజల్ ఇకపై చిత్రాలు చేయదట. అందుకు ఆమె రెండోసారి తల్లి కావడమే కారణం అంటున్నారు. ఆల్రెడీ ఏడాది కొడుకు ఉండగా, కాజల్ మళ్ళీ గర్భం దాల్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
ఒప్పుకున్న చిత్రాలు మాత్రం పూర్తి చేసి సిల్వర్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పేయాలని భావిస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేదు. అయినా ప్రముఖంగా వినిపిస్తోంది. అదే నిజమైతే ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి కావడం ఖాయం. కొడుకుతో పాటు పుట్టబోయే బిడ్డ ఆలనాపాలనా స్వయంగా చూసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. కాజల్ తెలుగులో స్టార్ గా ఎదిగారు. అనంతరం సౌత్ ఇండియా మొత్తం ఏలారు. టాప్ స్టార్స్ పక్కన జతకట్టారు. చందమామ, మగధీర ఆమెకు బ్రేక్ ఇచ్చాయి.