Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ మంగళవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ కొడుక్కి ఇప్పటికే పేరు కూడా పెట్టారు. పేరు ఏమిటో తెలుసా ? ‘నీల్ కిచ్లు’. మొత్తానికి మాతృత్వంలోని మధురానుభూతులను ఫుల్ గా ఆస్వాదిస్తున్న కాజల్ అగర్వాల్ తాజాగా ఒక పోస్ట్ పెట్టింది.
కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెడుతూ ఒక పెద్ద మెసేజ్ రాసుకొచ్చింది. భావోద్వేగంతో మెసేజ్ రాసిన కాజల్ మాటల్లోనే ఆ మెసేజ్ లో ఏముందో చూద్దాం. ‘‘నా బిడ్డ నీల్ ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం నాకు చాలా సంతోషంగా ఉంది.
Also Read: RRR: ఓటీటీ రాక పై కొత్త పుకారు.. డేట్ తెలిస్తే షాక్ అవుతారు !
నీల్ మొదటిసారి నా ఛాతిపై పడుకున్నప్పుడు నేను ఎంతో ఆనందాన్ని అనుభవించాను. నాకు ఆ అనుభూతి జీవితకాలం మరచిపోలేని జ్ఞాపకం. నా బిడ్డను హత్తుకున్నప్పుడు నాకు ప్రేమ లోతు, దాని సామర్థ్యం అర్థం అయ్యాయి. నా బిడ్డ తాకిడితో నా బాధ్యతల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాను.
నా పై నాకే విపరీతమైన కృతజ్ఞతా భావం కలిగింది. అసలు ఒక ప్రాణికి జన్మనివ్వడం అంత సులభం కాదు. చాలామందికి తెలియదు. నేను డెలివరీ డేట్ దగ్గర పడేకొద్దీ.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మీకు తెలుసా ? దాదాపు నేను మూడు రోజులు పాటు నిద్ర కూడా పోలేదు. నా బిడ్డను ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా ? అంటూ నాలో నేనే ఎంతో తపన పడ్డాను.
నా బిడ్డ పుట్టాక, నా మనసు ఎంతో ఆనందంగా ఉంది. లేచిన వెంటనే.. వాడిని హత్తుకోవడం, అలాగే వాడి కళ్లలోకి ప్రేమగా చూస్తూ ముద్దాడుతూ ఉంటే.. మాటల్లో చెప్పలేను. అనుభవించి తీరాలంతే. డెలివరీ తర్వాత అమ్మాయి ఆకర్షణీయంగా కనిపించదు. కానీ కచ్చితంగా అందంగా ఉంటుంది’’ అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.
Also Read:Rashmika Mandanna: ఆలియా ప్లేస్ కొట్టేసిన రష్మిక.. ఇది ఎన్టీఆర్ కి షాకే !
Recommended Videos: