టాలీవుడ్లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోగా ఎదిగింది. తొలినాళ్లలో చిన్న హీరోల పక్కన నటించిన కాజల్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ మూవీ హిట్టుతో టాప్ ప్లేసులోకి దూసుకెళ్లింది. వరుసగా అగ్రహీరోల పక్కన నటిస్తూ టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. రాంచరణ్ పక్కన కాజల్ నటించిన ‘మగధీర’ మూవీ కాజల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీలో కాజల్ గ్లామర్, నటనకు యువత ఫిదా అయ్యారు. దీంతో కాజల్ కు యువతలో భారీ ఫ్యాన్ ఏర్పడింది.
కాజల్ తాజాగా అల్లరి నరేష్ పక్కన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కొరియన్ మూవీ ‘డ్యాన్సింగ్ క్వీన్’ తెలుగు రీమేక్‌లో కాజల్ నటించనుంది. ఈమూవీలో కాజల్‌తోపాటు అల్లరి నరేష్ నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన సురేష్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలుగులోఅగ్ర హీరోలందరి సరసనా కాజల్ నటించింది. ప్రస్తుతం కొత్త భామల ఎంట్రీ, ఏజ్ బార్ అవుతుండటంతో కాజల్ అవకాశాలు తగ్గు ముఖంగా పట్టాయి. అయినప్పటికీ సీనియర్ హీరోల సరసన కాజల్ దక్కించుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ-150‘ మూవీలో కాజల్ నటించింది. తాజాగా ‘భారతీయుడు-2’ మూవీలో కమల్‌హాసన్‌కు జోడీగా నటిస్తుంది. ఈ మూవీలో కాజల్ 60ఏళ్ల భామగా కనిపించనుందని తెలుస్తోంది.