Homeఎంటర్టైన్మెంట్చిన్న హీరోకి పెద్ద అవకాశం

చిన్న హీరోకి పెద్ద అవకాశం

వెళ్లి పోమాకే అనే చిన్న చిత్రం తో విశ్వక్సేన్ హీరోగా తెరంగేట్రం చేసాడు. 2017 లో విడుదలైన ఈ చిత్రం తరవాత 2018 లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది చిత్రం చేయడం జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై రూపొందిన ఈ చిత్రం ఆర్ధికంగా పరవాలేదు అన్న రీతిలో ఆడింది. ఈ చిత్రం తరవాత 2019 లో ఫలక్ నుమా దాస్ అనే మరో చిన్న చేస్తే అది కూడా ఒడ్డున పడింది. ఇక తాజాగా 2020 ఫిబ్రవరి 28 న విడుదలైన “హిట్” సినిమా పెద్ద సక్సెస్ సాధించి విశ్వక్సేన్ ని నటుడిగా మరో మెట్టు ఎక్కించింది.

అలా వరుస విజయాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ హీరోగా, బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో ఓ సినిమా రాబోతుంది. . కాగా క్రేజీ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకి “పాగల్” అనే టైటిల్ ను ఫిక్స్ చేసిందట ఆ చిత్ర బృందం. త్వరలోనే చిత్రబృందం కూడా ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనుంది.

కాగా ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ రెండో వారం నుండి మొదలుకానుంది. ఇక “ హిట్” లాంటి సూపర్ హిట్ మూవీ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన విశ్వక్ సేన్ కి లక్కీ మీడియా బ్యానర్ ఆఫర్ ఇవ్వడం తో ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి
Slow and steady wins the race

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular