Kajal Aggarwal: ఎంత మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ కి వచ్చినా , కుర్రాళ్లలో చెక్కు చెదరని క్రేజ్ ఉన్న హీరోయిన్స్ అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు. వారిలో ఒకరు కాజల్ అగర్వాల్, ఈమె అందానికి ఫిదా అవ్వని కుర్రాడు ఈ భూలోకంలో ఉండదు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అలాంటి అందం ఆమె సొంతం. ముఖ్యంగా కెరీర్ ప్రారంభించిన కొత్తల్లో స్వర్గం నుండి భువికి దిగి వచ్చిన దేవకన్య లాగ ఉండేది.
‘లక్ష్మి కళ్యాణం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె, ఆ తర్వాత ‘చందమామ’ సినిమా తో అందరి దృష్టిలో పడింది. ఈ చిత్రం తర్వాత ఆమె చేసిన ‘మగధీర’ చిత్రం ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అనతి కాలం లోనే టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా నిల్చింది.
కేవలం తెలుగు లో మాత్రమే కాదు, తమిళం లో కూడా ఈమె దాదాపుగా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. అంత డిమాండ్ ఉండే కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలను బాగా తగ్గించేసింది. ప్రస్తుతం ఆమె బాలయ్య బాబు తో ‘భగవత్ కేసరి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది, దీనితో పాటుగా కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 చిత్రం లో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
ఎంత కాదు అనుకున్న కాజల్ అగర్వాల్ కి పెళ్లి తర్వాత అప్పట్లో ఉన్నంత అందం ఇప్పుడు లేదు, బాగా తగ్గింది అనే నిజాన్ని మాత్రం కాదు అనలేము. అందుకే ఆమె తన మునుపటి పూర్వ వైభోగాన్ని తిరిగి తప్పించుకునేందుకు, వర్కౌట్స్ తెగ చేసేస్తుంది. రీసెంట్ గా ఈమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్న వీడియో సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. అందులో ఆమె ఓవర్ గా వర్కౌట్స్ చేస్తూ ఏడ్చేయడాన్ని మనం గమనించొచ్చు, ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
https://www.youtube.com/watch?v=Br2URTzAsVg