Kanguva Movie: తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) దాదాపుగా మూడేళ్ళ పాటు ఎంతో కస్టపడి చేసిన ‘కంగువ'(Kanguva Movie) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. సుమారుగా 350 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అయితే ఈ సినిమా పై సూర్య సతీమణి జ్యోతిక(Jyothika) అప్పట్లో చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన భర్త సినిమాపై ఎందుకు ఇంత పగబట్టారో అర్థం కావడం లేదు, ఒక హీరో కి సంబంధించిన మీడియా పనిగట్టుకొని ఈ సినిమాపై నెగటివ్ రివ్యూస్ ఇచ్చారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘డాబా కార్టెల్’ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.
ఈ సందర్భంగా ఆమె విడుదలకు ముందు పలు ఇంటర్వ్యూస్ చేసింది. ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె ‘కంగువ’ ప్రస్తావన వచ్చినప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయింది. ఆమె మాట్లాడుతూ ‘నా భర్త సూర్య ని చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది. నేటి తరం హీరోలెవ్వరూ చేయలేని ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు ఆయన చేసాడు. కంగువ చిత్రం కూడా అలాంటిదే. ఈ సినిమాని అన్యాయం గా తొక్కేశారు. సినిమా ప్రారంభం లో తొలి అరగంట మాత్రమే బాగాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ మాత్రమే పెద్దగా ఉన్నట్టు అనిపించింది. కానీ సినిమాలో బాగున్న సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటి గురించి ఒక రివ్యూయర్ కూడా మాట్లాడలేదు. అదే నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. కంగువ కి ఇలాంటి రివ్యూస్ ఇచ్చిన వీళ్ళే, కొన్ని చెత్త సినిమాలకు మంచి రేటింగ్స్ ఇచ్చారు, విచిత్రం ఏమిటంటే అవి కమర్షియల్ గా కూడా సూపర్ హిట్స్ అయ్యాయి’.
‘కానీ ఎంతో మంచిగా ఉన్నటువంటి కంగువ లో మాత్రం ఒక్క మంచి సన్నివేశం కూడా లేదు అన్నట్టుగా రుద్దేశారు. ఆ రివ్యూస్ చూసినప్పుడు నా మనసుకి చాలా బాధేసింది, అసభ్యకరమైన పదజాలం ఉన్న సినిమాలు, సమాజాన్ని చెడగొట్టే సన్నివేశాలు ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి, ఇలాంటి మంచి సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. నిజానికి జ్యోతిక చెప్పిన విషయం లో కూడా పాయింట్స్ ఉన్నాయి. నిజంగానే ఇటీవల విడుదలైన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకంటే ఈ చిత్రం చాలా బెటర్ గా ఉంది. థియేటర్స్ లో మంచి కమర్షియల్ సక్సెస్ లుగా నిల్చిన ఈ చిత్రాలు, ఓటీటీ లో వచ్చిన తర్వాత ఆడియన్స్ ఈ సినిమాని ఎలా హిట్ చేసారు రా బాబు అని తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ‘కంగువ’ మాత్రం అంత పెద్ద డిజాస్టర్ అవ్వాల్సిన సినిమా అసలు కాదే అని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది.