Sherin Shringar: ఒకటి, రెండు సినిమాల్లో నటించిన కొందరు హీరోయిన్లు ఆ తరువాత కనిపించకుండా పోతారు. కానీ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఇక్కడి వారికంటే ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే ఫేమస్ అయ్యారు. ఆ తరువాత మిగతా ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించి సినిమాల నుంచి తప్పుకున్నారు. లేటేస్టుగా ఓ హీరోయిన్ ఓల్డ్ పిక్ వైరల్ అవుతుంది. ఈమె తమిళంలో ఫస్ట్ మూవీనే ఇప్పటి స్టార్ హీరోతో నటించింది. ఆ తరువాత కన్నడంలో కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో రెండే రెండు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తరువాత ఇండస్ట్రీని వదిలిపోయింది. అయితే ఇంతకాలాని తన ఫస్ట్ మూవీకి సంబంధించిన పిక్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?
ఇప్పటికైనా ఈమె ఎవరో గుర్తుపట్టారా? ఆమె పేరు షెరీన్ శ్రీనగర్. ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆమె నటించిన సినిమాల గురించి చెబితే గుర్తుపడుతారు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘జూనియర్స్’ గుర్తుందా? ఇందులో ఆయన పక్కన నటించింది షెరీన్. ఆ తరువాత కృష్ణ వంశీ ‘డేంజర్’ సినిమాలోనూ కనిపిస్తుంది. ఈ రెండు సినిమాలతో అమ్మడుకు గుర్తింపు వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో కన్నడ పరిశ్రమకు వెళ్లిపోంది.
షెరీన్ శ్రీనగర్ పుట్టి పెరిగింది కర్ణాటకలోనే. కన్నడంలో ‘పోలీస్ డాగ్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరవాత తమిళంలో ధనుష్ తో కలిసి ‘తుల్లువదొల్లమయి’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమానే తెలుగులో జూనియర్స్ పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో సక్సెస్ సాధించిన ఈ మూవీ తెలుగులో యావరేజ్ గా నడిచింది. అయితే తెలుగులో రెండు సినిమాల్లోనే నటించిన తరువాత షెరీన్ కు పెద్దగా అవకాశాలు రాలేదు.
ఇటు తమిళం, కన్నడంలోనూ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే లేటేస్టుగా ఆమెకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లంగా వోనీలో ఉన్న ఈమె యూత్ గుండెల్లో మంట పుట్టిస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ పూర్తిగా మారిపోయిన షెరీన్ మళ్లీ సినిమాల్లో నటించాలని అంటున్నారు. కానీ షెరీన్ మాత్రం స్పందన లేదు.