Cricketer Venugopal Rao
Cricketer Venugopal Rao: రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ మెగా షోకు ఉన్న క్రేజ్ ఎటువంటిదో అందరికీ తెలుసు. ఈ షోలో సినీ తారల నుంచి సామాజిక మాధ్యమాల వల్ల సెలబ్రిటీలుగా మారిన ఎంతోమంది పాల్గొన్నారు. ప్రేక్షకుల ఆకాంక్షలకు అనుగుణంగా షోలో మార్పులు చేస్తూ వినోదాన్ని అందిస్తోంది యాజమాన్యం. ఈ నేపథ్యంలో ఏడో సీజన్ ప్రారంభించేందుకు మా టీవీ ఏర్పాట్లు చేస్తోంది. ఏడో సీజన్ కు సంబంధించిన కార్యక్రమం ఆగస్టు నెల చివరి వారంలో ప్రారంభం కానుంది. దీంతో ఏడో సీజన్లో ఎవరు పాల్గొంటున్నారు అన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఏడో సీజన్ కు సంబంధించి ఒక అప్డేట్ బిగ్ బాస్ అభిమానులను కూడా ఆనందానికి గురి చేస్తుంది. అదే ఈ ఏడాది సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు ఒకడు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నాడని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రారంభమైనా అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. విభిన్న మైనటువంటి థీమ్స్, భిన్న రంగాలకు చెందిన కంటెస్టెంట్స్ తో నిర్వాహకులు ఏటా షో కోసం సిద్ధమవుతుంటారు. ఈ ఏడాదితో ఏడో సీజన్ లోకి అడుగుపెడుతోంది బిగ్ బాస్ షో. దీంతో ఈసారి మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు నిర్వాహకులు. మరిన్ని సర్ప్రైజులు, థ్రిల్లింగ్ అంశాలు, భావోద్వేగాలు ఉంటాయని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఓటిపి వేదికైనా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కానుంది అని నిర్వాహకులు వెల్లడించారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సీజన్ ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభమయ్య సీజన్ క్రికెట్ అభిమానులను కూడా అలరించనుంది. ఈ ఏడాది కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
కంటెస్టెంట్ గా అడుగుపెట్టనున్న క్రికెటర్ వేణుగోపాలరావు..
ఏడో సీజన్ ను మరింత ఆసక్తిగా మార్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్స్ ను గుర్తించిన యాజమాన్యం ఈ సీజన్లో పాల్గొనేలా వారిని ఒప్పించింది. ఇప్పటికే యూట్యూబ్లో అదరగొడుతున్న పలువురు ఈ సీజన్లో పాల్గొంటారని లీకులు ఉన్నాయి. తాజాగా ఇండియన్ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వై వేణుగోపాలరావును ఈ మెగా షోలోకి తీసుకువచ్చే ఆలోచనను స్టార్ మా గట్టిగానే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తొలి క్రికెటర్ గా వేణుగోపాలరావు రికార్డు క్రియేట్ చేయనున్నాడు. దీనికి ప్రధాన కారణం బిగ్ బాస్ ఆరో సీజన్ లో సరైన కంటెస్టెంట్లను ఎంపిక చేయకపోవడంతో అంతగా ఆ సీజన్ మెప్పించలేదని అభిప్రాయం చాలా మందిలో ఉంది. దీంతో ఈ సీజన్ ను ఆసక్తికరంగా వీక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ఈసారి తప్పులు జరగకుండా గుర్తింపు ఉన్న వారిని బిగ్ బాస్ షో కోసం తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రణాళిక రచిస్తున్నారు. క్రికెటర్ గోపాల్ రావు కనుక ఈ షోలో పాల్గొంటే క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. వేణుగోపాలరావు 2019లో క్రికెట్కు గుడ్ బాయ్ చెప్పిన విషయం తెలిసిందే. 2005లో తొలి వన్డే ఆడిన వేణుగోపాలరావు 10 నెలలు వ్యాధి లోనే 16 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో వేణుగోపాలరావు ఒకే ఒక అర్థ సెంచరీ చేశాడు. అబుదాబిలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 93 బంతుల్లో 61 సాధించాడు. ఇక ఐపీఎల్ లో చార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున కలిపి వేణు 45 మ్యాచ్లు ఆడాడు. ప్రస్తుతం క్రికెటర్ దూరంగా ఉంటున్న వేణుగోపాల్ రావును ను బిగ్ బాస్ షో ఏడో సీజన్లోకి తీసుకువస్తే మాత్రం ఆసక్తికరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
Web Title: Indian cricketer venugopala rao telugu bigg boss 7
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com