https://oktelugu.com/

Junior NTR : ఆ సన్నివేశం చేసేటప్పుడు నేను చనిపోతానని ఫిక్స్ అయిపోయా అంటూ జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు!

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ 'సమ్మర్ లో మేము గోవా బీచ్ దగ్గర ఒక్క సన్నివేశం షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసాం. సూర్యుడు ఆరోజు నిప్పులు చిమ్ముతున్నాడు. ఆ వేడిని తట్టుకోలేక చనిపోతానేమో అని అనుకున్నాను. నా భార్య పిల్లల్ని గుర్తు చేసుకున్నాను. షాట్ పూర్తి అవ్వగానే AC రూమ్ లోకి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను

Written By:
  • Vicky
  • , Updated On : September 21, 2024 / 12:47 PM IST

    Junior NTR

    Follow us on

    Junior NTR :  మరో వారం రోజుల్లో కోట్లాది మంది అభిమానులు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో మొదలైంది. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే 1.6 మిలియన్ డాలర్ గ్రాస్ వసూళ్లు ఇప్పటి దాకా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభంలో ప్రీమియర్స్ ఆల్ టైం రికార్డు పెడుతుంది అని అనుకున్నారు కానీ, అది ఇప్పుడు అసాధ్యం అని తెలుస్తుంది. 2 మిలియన్ డాలర్స్ కి పైగా కచ్చితంగా ప్రీమియర్ వసూళ్లు వస్తాయని కానీ, #RRR , కల్కి రికార్డ్స్ బద్దలు కొట్టడం కష్టమే అని అంటున్నారు. ఈ రెండు సినిమాలు నార్త్ అమెరికా నుండి 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల 23 వ తారీఖు నుండి మొదలు పెట్టనున్నారు.

    ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి, అదనపు షోస్ వేసుకోవడానికి అనుమతులు కూడా ఇచ్చేసాయి. ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ ని ఎంతో అభిమానించే యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ కలిసి ఎన్టీఆర్, కొరటాల శివ తో ఒక ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ గోవా షూటింగ్ లో తనకి ఎదురైన సమస్యల గురించి చెప్పుకున్నాడు.

    ఆయన మాట్లాడుతూ ‘సమ్మర్ లో మేము గోవా బీచ్ దగ్గర ఒక్క సన్నివేశం షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసాం. సూర్యుడు ఆరోజు నిప్పులు చిమ్ముతున్నాడు. ఆ వేడిని తట్టుకోలేక చనిపోతానేమో అని అనుకున్నాను. నా భార్య పిల్లల్ని గుర్తు చేసుకున్నాను. షాట్ పూర్తి అవ్వగానే AC రూమ్ లోకి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను. కానీ అప్పుడే కరెంటు పోయింది. ఇక నాకు ఎంత చిరాకు కలిగి ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. వెంటనే స్టాఫ్ కి ఫోన్ చేసి జెనరేటర్ వేయమని చెప్పాను. కానీ నా దురదృష్టం చూడండి ఎలా ఉందో. దాని ముందు రోజే జెనరేటర్ రిపేర్ కి వెళ్లిందట’ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అయినా ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్ తో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి మొత్తం చూసుకోవాలి కదా, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల సమక్షం లో విడుదల చేయనున్నారు.