Junior NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు’ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ తో పోటీపడుతూ మన ఇండస్ట్రీని నెంబర్ వన్ పొజిషన్ కి తీసుకురావడానికి ఆయన తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తన ఫ్యామిలీ నుంచి ఆయన తర్వాత తన కొడుకు బాలయ్య బాబు హీరోగా అరంగేట్రం చేశాడు. ఇక అతని తర్వాత మరి కొంతమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చినప్పటికి వాళ్ళు ఎవ్వరు సక్సెస్ లను సాధించలేదు. ఇక నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మొదటి సినిమాతో తడబడ్డప్పటికి స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాడు…ఇక అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను చూసిన స్టార్ హీరోలు సైతం భయంతో వణికిపోయారు.
కారణమేమిటి అంటే జూనియర్ ఎన్టీఆర్ 18 సంవత్సరాల వయసులోనే 30 కోట్ల కలెక్షన్స్ ను సాధిస్తూ భారీ రికార్డులను క్రియేట్ చేశాడు. అప్పట్లోనే ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలను చేయడం అనేది మామూలు విషయం కాదు…ఇక దానికి తోడుగా ఆయన ఏజ్ కి మించిన పాత్రలు చేశాడు.
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఇలాంటి ఎన్టీఆర్ ప్రస్తుత కాలంలో చాలా వరకు వెనుకబడిపోతున్నాడు. ఇప్పుడున్న హీరోలను ఢీకొట్టడంలో ఆయన వెనుకబడిపోయాడనే చెప్పాలి. పాన్ ఇండియాలో తనకు భారీగా మార్కెట్ అయితే క్రియేట్ అవ్వడం లేదు.
ఇప్పుడు రాబోతున్న సినిమాలతో తనను తాను మరోసారి ఎలివేట్ చేసుకుంటే తప్ప బాలీవుడ్ ఇండస్ట్రీలో గాని పాన్ ఇండియాలో గాని అతను నిలబడడం చాలా కష్టతరమవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మైంటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఒకవేళ ఈ విషయంలో చిన్న పొరపాటు జరిగిన కూడా ఆయన భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరమైతే రావచ్చు…