Junior NTR: ప్రస్తుత జనరేషన్ లో సౌత్ ఇండియా లోనే కాదు, ఇండియా మొత్తం మీద టాప్ 3 బెస్ట్ డ్యాన్సర్లు ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్. వీళ్ళు ముగ్గురు డ్యాన్స్ చూస్తే అసలు వీళ్లకు ఎముకలు ఉన్నాయా, ఆ స్పీడ్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి అని ఆశ్చర్యపోతుంటాము. ఎన్టీఆర్ బాగా లావుగా ఉన్న సమయంలో ఆయన డ్యాన్స్ ని చూస్తే ఎవరైనా చేతులెత్తి దండం పెట్టాల్సిందే. అంత లావుగా ఉన్నప్పుడు ఒక మనిషి నడవడమే చాలా కష్టం గా ఉంటుంది. అలాంటిది ఎన్టీఆర్ అనితర సాధ్యమైన స్టెప్పులు అలవోకగా వేయడమే కాదు, అత్యంత వేగంగా, చూసే ఆడియన్స్ కి అందంగా అనిపించేలా వేస్తాడు. అలా బహుశా ఇండియా లో ఏ హీరో కూడా వేయలేరేమో, అందుకే ఎన్టీఆర్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండేళ్ల లోనే, 20 ఏళ్ళ వయస్సు కూడా నిండని రోజుల్లోనే సౌత్ లో బిగ్గెస్ట్ మాస్ హీరోలలో ఒకరిగా నిలిచాడు.
ఒకానొక దశలో ఈయన మెగాస్టార్ చిరంజీవి కి కూడా విపరీతమైన పోటీ ని ఇచ్చాడు. అలాంటి ఎన్టీఆర్ కి ఒక హీరో డ్యాన్స్ నచ్చడం అంటే ఆ హీరో అదృష్టం అనే చెప్పాలి. అలాంటి అదృష్టం తమిళ హీరో విజయ్ కి దక్కింది. రీసెంట్ గా ఈయన ‘దేవర’ మూవీ ప్రొమోషన్స్ కోసం తమిళనాడు కి వెళ్ళాడు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విజయ్ డ్యాన్స్ గురించి మాట్లాడుతూ ‘చాలా మంది డ్యాన్స్ అంటే ఈమధ్య సర్కస్ ఫీట్స్ అనుకుంటున్నారు. జిమినాస్టిక్స్ చేసి అవే డ్యాన్స్ అని ఫీల్ అవుతున్నారు. నాకు అలాంటి వారు నచ్చరు, విజయ్ సార్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ ని ఎంజాయ్ చేస్తూ వేస్తారు, పెద్దగా శ్రమపడినట్టు అనిపించదు, చూసేవారికి అది ఎంతో బాగుంటుంది’ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. విజయ్ మంచి డ్యాన్సర్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎన్టీఆర్,అల్లు అర్జున్, రామ్ చరణ్ ని మించిన డ్యాన్సర్ అయితే కాదు.
డ్యాన్స్ లో అనేక ఫామ్స్ తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ కి విజయ్ డ్యాన్స్ ది బెస్ట్ అని ఎలా అనిపించింది అనేది ఆయన అభిమానుల్లో కూడా కలిగిన సందేహం. పైగా సర్కస్ ఫీట్స్ చేయడం డ్యాన్స్ కాదు అంటూ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసాడు?, అప్పట్లో అల్లు అర్జున్ డ్యాన్స్ ఇలాగే ఉండేది, అనితర సాధ్యమైన స్టెప్పులు వేసేవాడు, ఎన్టీఆర్ అల్లు అర్జున్ ని ఉద్దేశించే ఇలాంటి కామెంట్స్ చేశాడా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో కలిగింది. విజయ్ మన తెలుగు హీరోలు వేసే డ్యాన్స్ స్టెప్పులను తమిళం లో రీమేక్ చేసేవాడు. మన హీరోలు వేసిన రేంజ్ లో ఆయన పావు శాతం కూడా వేయలేకపోయాడు, అలాంటి హీరో డ్యాన్స్ ఎన్టీఆర్ కి అంతలా ఎలా నచ్చిందో అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.