
Junior NTR- Comedian Raghu: సినిమాల్లో పాపులర్ కమెడియన్ గా కొనసాగి,ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా రాణించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన నటుడు రఘు కారుమంచి.ఇప్పటి వరకు ఈయన దాదాపుగా 150 సినిమాల్లో కమెడియన్ గా చేసాడు చేసాడు కానీ, మెయిన్ కమెడియన్ గా మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు.రౌడీల గుంపులో ఒకడిగా చేరి కామెడీ చేస్తుండే రోల్స్ లో మాత్రమే కనిపిస్తుండేవాడు ఈయన.అయితే సడన్ గా రఘు సినిమాల్లో కనిపించడం మానేసాడు,జబర్దస్త్ షో ని కూడా వదిలేసాడు.
అది ఆయన కావాలని వదిలేసింది కాదు,అవకాశాలు రాలేదు అంతే!,అయితే కరోనా సెకండ్ వేవ్ కి ముందు ఆయన ఒక వ్యాపారం ప్రారంభించి మొత్తం నష్టపోయాడు.సంపాదించింది మొత్తం కోల్పోయాడు.ఆర్థికంగా నరకం చూసాడు, కానీ ఆ తర్వాత చిన్నగా కోలుకొని లిక్కర్ బిజినెస్ లో కోట్లు సంపాదించి స్టార్ హీరోలతో సమానమైన ఇంటిని కూడా నిర్మించుకున్నాడు.

అయితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తాను ఎదురుకున్న ఆర్ధిక కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.అయితే అప్పట్లో రఘు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సహాయం చేసాడని సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది.ఇదే విషయాన్నీ రఘు ముందు ప్రస్తావించగా , ఆయన దానికి సమాధానం చెప్తూ ‘అందులో ఎలాంటి నిజం లేదండి.ఎంత కష్టమొచ్చినా ఆకలితో ఉంటాను, పని కోసం ప్రయత్నాలు చేస్తాను కానీ, ఒకరి ముందు చెయ్యి చాచి సహాయం అడిగే తత్త్వం కాదు నాది, కానీ నేను ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న విషయం నేనిచ్చిన ఒక ఇంటర్వ్యూ ద్వారా ఎన్టీఆర్ కి తెలిసింది.అప్పుడాయన ‘నీ దగ్గర డబ్బులు మొత్తం పొయ్యినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు బే’ అని అన్నాడు.నా మీద ఆయన చూపించిన ఆ ప్రేమ చాలు’ అంటూ చెప్పుకొచ్చాడు రఘు.