Rahul Sipliganj: ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ పాడిన రాహుల్ సిప్లిగంజ్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారంటే! ఊహించని షాక్!

Rahul Sipliganj: ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రకటించినప్పటి నుండి అది విడుదలయ్యే వరకు ఆస్కార్ అనే ఆలోచన ఎవరిలో లేదు. అమెరికాలో విడుదలయ్యాక కూడా భారతీయ ప్రేక్షకులు ఆ కోణంలో ఆలోచించలేదు. కారణం భారతీయులు అవార్డ్స్ కోసం సినిమాలు తీయరు. సినిమాను కేవలం బిజినెస్ గా చూస్తారు. మెజారిటీ ప్రేక్షకులు ఇష్టపడే మాస్ కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే ప్రయత్నం చేస్తారు. ఎంత పెట్టాం ఎంత వచ్చిందనేది ముఖ్యం. ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా అలాంటి […]

Written By: Shiva, Updated On : March 16, 2023 11:21 am
Follow us on


Rahul Sipliganj:
ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రకటించినప్పటి నుండి అది విడుదలయ్యే వరకు ఆస్కార్ అనే ఆలోచన ఎవరిలో లేదు. అమెరికాలో విడుదలయ్యాక కూడా భారతీయ ప్రేక్షకులు ఆ కోణంలో ఆలోచించలేదు. కారణం భారతీయులు అవార్డ్స్ కోసం సినిమాలు తీయరు. సినిమాను కేవలం బిజినెస్ గా చూస్తారు. మెజారిటీ ప్రేక్షకులు ఇష్టపడే మాస్ కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే ప్రయత్నం చేస్తారు. ఎంత పెట్టాం ఎంత వచ్చిందనేది ముఖ్యం. ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా అలాంటి ఒక భారీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ వస్తుందన్న ఊహ కూడా ఎవరికి లేదు.

చెప్పాలంటే మూవీ తీసిన రాజమౌళికి కూడా. అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ కి ఆదరణ దక్కిన తర్వాత ఆయన ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. చిన్న ఆలోచనతో మొదలైన ఆయన ఆశల ప్రయాణం లక్ష్యం చేరుకొని అందరినీ అబ్బురపరిచింది. ఇండియన్ సినిమాకు ఆస్కార్ అనే అతిపెద్ద గౌరవం దక్కింది. అందులోనూ ఒక తెలుగు సినిమా తరపున టాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు ఆస్కార్ ఈవెంట్లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కించుకున్నారు.

ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేటైన నాటు నాటు ఆస్కార్ కైవసం చేసుకుంది. ఈ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ సాంగ్ కి పని చేసిన ప్రతి ఒక్కరి పేరు వరల్డ్ వైడ్ వినిపించింది. కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ వేదికపైకి వెళ్లి అవార్డ్స్ అందుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.

వీరందరిలో రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఒక సాధారణ బార్బర్ ఆస్కార్ వరకు వెళ్లిన విజయ ప్రస్థానం గురించి చర్చించుకోవాలి. తనలో టాలెంట్ ఉందని నమ్మిన రాహుల్ సిప్లిగంజ్ యూట్యూబ్ లో సొంతగా వీడియోలు చేశారు. అనూహ్యంగా ఆయన వీడియోలు ఆదరణ దక్కించుకున్నాయి. అలా యూట్యూబ్ సింగర్ గా ఫేమస్ అయ్యాడు. సినిమాల్లో పాడే అవకాశం దక్కించుకున్నారు.

ఇక బిగ్ బాస్ షోకి వెళ్లడం ఆయనకు మరింత కలిసొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన రాహుల్ సిప్లిగంజ్ ఏకంగా టైటిల్ అందుకున్నారు. సీజన్ 3లో ఆయన యాంకర్ శ్రీముఖితో పోటీపడ్డారు. శ్రీముఖి రన్నర్ గా నిలిచారు. హౌస్లో నటి పునర్నవితో రాహుల్ లవ్ ట్రాక్ హైలెట్ అయ్యింది. అనంతరం స్టార్ ప్లే బ్యాక్ సింగర్ గా ఎదిగి… ఆర్ ఆర్ ఆర్ మూవీలో నాటు నాటు పాడే ఛాన్స్ దక్కించుకున్నాడు. ప్రపంచాన్ని ఊపేసిన నాటు నాటు సాంగ్ పాడిన రాహుల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే ఒక ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ నిర్మాత ఆయనకు రూ. 5 లక్షలు ఇచ్చారట. రెమ్యునరేషన్ పక్కన పెడితే ఆ సాంగ్ ఆయనకు తెచ్చిన గౌరవం డబ్బుతో వెలకట్టలేనిది.