https://oktelugu.com/

JR.NTR VS Allu Arjun : ఆ విషయం లో అల్లు అర్జున్ కంటే జూనియర్ ఎన్టీయార్ చాలా బెటర్…

సినిమా ఇండస్ట్రీ లో ఏ రోజు ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు...ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఇగో ప్రాబ్లం ఉంటుంది...దానివల్లే ప్రతి విషయానికి హీరోలు హార్ట్ అవుతూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాల్లో హీరోల మధ్య గొడవలు కూడా జరిగాయి...

Written By:
  • Gopi
  • , Updated On : August 30, 2024 8:14 pm
    JR.NTR - Allu Arjun

    JR.NTR - Allu Arjun

    Follow us on

    JR.NTR – Allu Arjun : నందమూరి ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు శ్రీ ‘నందమూరి తారక రామారావు’ గారి పేరు చిరకాలం సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంది. సినిమా నటుడిగా సేవ చేయడమే కాకుండా సినిమా నుంచి వచ్చిన ఒక నటుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా ఎదగడం అంటే నార్మల్ విషయం కాదు. అందుకే ఆయన లాంటి నటుడు మరొకరు లేరు రారు అనేది మాత్రం వాస్తవం… ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ మూడోవతారం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఆయన ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర ‘ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడం విశేషము… ఇక ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల ఇమేజ్ ను వాళ్ళ పేర్లను వాడుకొని ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ కి మధ్య గత కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ విషయాన్ని అల్లు అర్జున్ పదే పదే చాలా సార్లు ప్రేక్షకులకు తెలిసేలా ప్రవర్తిస్తున్నాడు.

    ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తుంటే ఆ పార్టీని కాదని తమ అపోజిషన్ పార్టీ అయిన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే క్యాండిడేట్ కి సపోర్ట్ చేయడం అనేది చాలా మందిని తీవ్రం గా కలిచి చేసింది. ఇక దాంతో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీమధ్య చాలా వరకు గొడవలు అయితే ఉన్నాయనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే నందమూరి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున మొదట్లో ప్రచారం నిర్వహించినప్పటికీ ఇప్పుడు ఆ పార్టీ అధినేత అయిన చంద్రబాబుకి ఎన్టీఆర్ కి మధ్య సంబంధాలు లేకపోవడంతో ఆయన పార్టీ నుంచి దూరంగా ఉంటున్నాడు. కానీ తన ప్రాణ స్నేహితులు ఆయన కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వైసీపీ నేతలకి సపోర్ట్ చేయడం లేదు ఈ విషయంలో అల్లు అర్జున్ తో పోలిస్తే ఎన్టీఆర్ చాలా వరకు బెటర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం…

    ఇక మొత్తానికి అయితే ఇటు అల్లు అర్జున్, అటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎండింగ్ లో ఇద్దరు భారీ సక్సెస్ లతో విజయాలను అందుకోవాలనే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతుంటే, అల్లు అర్జున్ హీరో వస్తున్న పుష్ప 2 సినిమా మాత్రం డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది…