September Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్ : సెప్టెంబర్ లో బ్యాంకులకు సెలవులు ఫుల్.. ఆ డేట్స్ ఇవే..

ప్రస్తుత ప్రపంచంలో బ్యాంకులు, ఏటీఎంలతో సంబంధం ఉండని ప్రజలు దాదాపుగా ఉండరనే చెప్పాలి. ప్రజల జీవితంలో బ్యాంకులు ఓ భాగమయ్యాయి. సుమారు 94శాతం మంది ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల సేవలను వినియోగించుకుంటున్నారని ఇటీవల కొన్ని సర్వే సంస్థలు వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం.

Written By: Mahi, Updated On : August 30, 2024 8:13 pm

September Bank Holidays

Follow us on

September Bank Holidays: ప్రస్తుత ప్రపంచంలో బ్యాంకులు, ఏటీఎంలతో సంబంధం ఉండని ప్రజలు దాదాపుగా ఉండరనే చెప్పాలి. ప్రజల జీవితంలో బ్యాంకులు ఓ భాగమయ్యాయి. సుమారు 94శాతం మంది ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల సేవలను వినియోగించుకుంటున్నారని ఇటీవల కొన్ని సర్వే సంస్థలు వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. ప్రతి ఒక్కరికి పొద్దున లేచింది మొదలు బ్యాంకులకు వెళ్లనిదే పని కాని పరిస్థితి. తమ నగదును భద్రపర్చుకోవడానికైనా, ఎవరికైనా డబ్బులు పంపించాల్చి ఉన్నా బ్యాంకులు, పోస్టాఫీసులు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేవు. ఇంతటి అవసరం ఉన్న బ్యాంకులు ఏ ఒక్కరోజు మూతపడ్డా వేల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి. సాధారణ సెలవు రోజుల్లో మినహాయిస్తే.. సమ్మెలు, బంద్ రోజుల్లో దీని ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది. వరుసగా రెండు, మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చియంటే చాలు.. ఇక ఆ మర్నాడు బ్యాంకులన్నీ ఖాతాదారులతో కిక్కిరిసిపోతాయి. బ్యాంకుల నిండా జనమే దర్శనమిస్తారు. వచ్చిన ఖాతాదారుల పని చేయడంలో బ్యాంకుల సిబ్బంది లీనమైపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

క్యాటగిరీల వారీగా విభజన ఇలా..
సాధారణంగా బ్యాంకు సెలవులను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రతి నెలా ప్రకటిస్తుంది. ప్రతి నెల చివరి వారంలో ఈ జాబితాను వెల్లడిస్తుంది. ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ నెలకు సంబంధించిన సెలవులను ఇటీవల ప్రకటించింది. సెలవులకు సంబంధించి దేశవ్యాప్తంగా పొందుపర్చిన కంప్లీట్ లిస్టును విడుదల చేసింది.

జనరల్ గా మూడు విభాగాలుగా ఆర్బీఐ సెలవులను విభజిస్తుంది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. వీటిలో ఒకటి నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ యాక్ట్ కాగా, ఇక రెండోది నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ హాలిడే. ఇక మూడోది బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్. ఈ మూడింట్లో ఫస్టు కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తున్నది. ఈ సెలవులను బ్యాంకులు విధిగా పాటించాల్సి ఉంటుంది. లేనిచో ఆర్బీఐ బ్యాంకులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.

ఇవే సెలవు దినాలు..
ఇక పండుగలు, తిథుల వారీగా ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం.. సెప్టెంబర్ లో బ్యాంకులకు 14 సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం. అన్ని రాష్ట్రాల్లో ఇది వర్తిస్తుంది. సెప్టెంబర్ 7న వినాయక చవితి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 8న ఆదివారం సెలవు. 13న శుక్రవారం రామ్ దేవ్ జయంతి పురస్కరించుకొని రాజస్థాన్ లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. 14న ఓనం పండుగ. మలయాళీలకు ప్రధాన పండుగ. కాబట్టి కేరళతోపాటు దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 15న ఆదివారం. 16న ఈద్–ఇ-మిలద్.. పుర స్కరించుకొని దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది.

17వ తేదీన ఇంద్ర జాతరను పురస్కరించుకొని సిక్కీం లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. 18న నారాయణగురు జయంతి సందర్భంగా కేరళలో హాలిడే ప్రకటించింది ఆర్బీఐ. 21న నారాయణగురు జీవ సమాధి పొందిన రో జు కాబట్టి సెలవు ఉంటుంది. 22న ఆదివారం సెలవు. 23న అమరవీరుల సంస్మరణ దినం రోజు కావడంతో హర్యానాలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 28వ తేదీన నాలుగో శనివారం, 29న ఆదివారం. ఇలా మొత్తం సెప్టెంబర్ నెలలో 14రోజులు సెలవులు రానున్నందున.. ఖాతాదారులు వీటిని దృష్టిలో పెట్టుకొని తమ బ్యాంకు పనులను చక్కదిద్దుకోవాలని సూచించింది.