NTR In Kantara: ఈమధ్య కాలం లో స్టార్ హీరోలు తమ ఇమేజ్ ని పక్కన పెట్టి వెరైటీ క్యారెక్టర్స్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, వెరైటీ క్యారెక్టర్స్ చేస్తే అభిమానుల నుండి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో, అసలు వాళ్ళు మమ్మల్ని ఇలాంటి క్యారెక్టర్స్ లో అంగీకరిస్తారో లేదో, రిస్క్ ఎందుకని చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఆడియన్స్ ప్రతీ ఒక్క స్టార్ హీరో నుండి కొత్తదనం కోరుకుంటున్నారు. డిఫరెంట్ కథలు, వెరైటీ పాత్రల్లో తమ హీరోలను చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే అద్భుతంగా నటించగలిగే సత్తా ఉన్న స్టార్ హీరోలు తమలో దాగి ఉన్న అన్ని కోణాలను బయటకు తీస్తున్నారు. అలాంటి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఇప్పటికే ఆయన ‘వార్ 2’ చిత్రం లో నెగిటివ్ క్యారక్టర్ చేశాడు. ఈ నెల 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..
ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో క్రేజీ చిత్రంలో కూడా ఆయన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన ‘కాంతారా’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా ఈ ఏడాది అక్టోబర్ 2న ‘కాంతారా 2’ రాబోతుంది. ఇది పూర్తి అయ్యాక ‘కాంతారా 3’ కూడా ఉంటుందట. రీసెంట్ గానే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తాన్ని పూర్తి చేసాడట రిషబ్ శెట్టి. ఇందులో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ కోసం రిషబ్ శెట్టి రీసెంట్ గానే జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించాడట. మొదటి నుండి రిషబ్ శెట్టి తో ఎన్టీఆర్ కి మంచి సాన్నిహిత్యం ఉంది.
ఈ కథ, అందులోని ఎన్టీఆర్ క్యారక్టర్ గురించి సుమారుగా మూడు గంటల పాటు కూర్చొని ఎన్టీఆర్ కి న్యారేషన్ ఇచ్చాడట. ఆయనకు ఆ పాత్ర తెగ నచ్చేసింది. వెంటనే చేస్తానని మాట ఇచ్చాడట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్క హీరో గా ప్రతిష్టాత్మక చిత్రాలు చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే, మరోపక్క వెరైటీ క్యారెక్టర్స్ ని చేస్తూ ఎన్టీఆర్ తన పరిధి ని ఎవ్వరూ ఊహించని రేంజ్ కి పెంచుకుంటూ వెళ్లబోతున్నాడు. ప్రశాంత్ నీల్ చిత్రం పూర్తి అవ్వగానే ‘దేవర 2’, నెల్సన్ తో ఒక సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయబోతున్నాడుల. ఈ గ్యాప్ లో ఆయన కాంతారా 3 షూటింగ్ ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.