కూలీ టీజర్ : ‘జైలర్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి విడుదలైన ‘లాల్ సలామ్’, ‘వెట్టియాన్’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నారు. రేంజ్ సక్సెస్ కాలేకపోయింది. ‘వెట్టియాన్’ చిత్రం రజినీకాంత్ క్రేజ్ ని కాపాడే విధంగా డీసెంట్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది కానీ, ‘లాల్ సలామ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కనీసం 10 కోట్ల రూపాయిల షేర్ ని కూడా వసూలు చేయలేకపోయింది. ఇలా రెండు సినిమాల అభిమానులను నిరాశ పర్చడం తో ఈసారి కొట్టబోయే సినిమాకి ఇండస్ట్రీ రికార్డ్స్ మరోసారి బద్దలు అవ్వాలి అనే కసితో ఉన్నారు అభిమానులు. వాళ్ళ కసికి తగ్గట్టుగానే ‘కూలీ’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. లోకేష్ కనకరాజ్ తమిళ నటిస్తున్న ఈ సినిమా కోసం కేవలం ఇండస్ట్రీ మాత్రమే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది.
Also Read : రజినీకాంత్ కూలీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..? ఊచకోత అంటే ఇదేనేమో..?
లోకేష్ కనకరాజ్ సినిమాలకు యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈయన రేంజ్ వేరే. అలాంటి దర్శకుడితో రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ చేతులు కలిపితే చిన్న పిల్లవాడి నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడతారు. టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్, లాంగ్ రన్ రాబట్టేంత సత్తా ఉన్న కాంబినేషన్ ఇది. అయితే ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు చాలా కాలం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి వస్తుందని అనుకున్నారు కానీ రాలేదు. మార్చి 14న లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈ టీజర్ లో వింటేజ్ రజినీకాంత్ మార్క్, స్టైల్, డైలాగ్ డెలివరీ ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు.
వీళ్ళు కూడా ఈ టీజర్ లో కనిపిస్తారని టాక్. నాగార్జున ఈ చిత్రం లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ ని చేసాడు. ఆయనకీ సంబంధించిన ఒక షూటింగ్ వీడియో సోషల్ మీడియా లో విడుదలై గత ఏడాది బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశంలో నాగార్జున ని చూస్తే ‘విక్రమ్’ ‘రోలెక్స్’ పాత్ర గుర్తుకు వచ్చింది. ఇప్పటి వరకు అక్కినేని అభిమానులు ఎప్పుడూ చూడని నాగార్జున కోణాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాడు లోకేష్ కనకరాజ్. ఆయనకు, నాగార్జునకు మధ్య వచ్చే పోటాపోటీ సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ కూడా ఈ టీజర్ లో పెడతారని సమాచారం. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 14న విడుదల కాబోతుందని సమాచారం. మార్చి 14న విడుదల చేయబోయే టీజర్‌లో, సినిమా విడుదల తేదీని కూడా పొందుతుందని తెలుస్తుంది.
Also Read : నాగ చైతన్యతో ఆ మూమెంట్స్ జీవితాంతం మర్చిపోలేను… బాంబు పేల్చిన సమంత!