Junior NTR and Balayya : సోషల్ మీడియా లో ఎన్టీఆర్, బాలయ్య బాబు అభిమానుల మధ్య ఇప్పుడు ఒక రేంజ్ లో గొడవ జరుగుతుంది. ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య చాలా కాలం నుండి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. బాలయ్య అనేక సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ గురించి పట్టించుకోకపోవడమే అందుకు ఉదాహరణ. నిన్న ‘అన్ స్టాపబుల్ 4’ ఎపిసోడ్ లో అదే రిపీట్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్నటి ఎపిసోడ్ కి బాలయ్య లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ మూవీ టీం మొత్తం పాల్గొనింది. వీళ్ళతో కాసేపు సరదాగా మాట్లాడిన బాలయ్య, డైరెక్టర్ బాబీ ని అతను పని చేసిన హీరోల గురించి ఒక్క మాటలో చెప్పమని అడుగుతూ, LED స్క్రీన్ మీద ఆ హీరోల ఫోటోలను వేయిస్తాడు. బాబీ పని చేసిన హీరోలందరి ఫోటోలు వేస్తారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ని మాత్రం వేయరు.
ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద వివాదాలకు దారి తీసింది. ఎన్టీఆర్ ని ప్రతీసారి ఇలా అవమానిస్తూనే ఉంటారా?, బాబీ ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’ సినిమా తీసాడు కదా, ఎందుకని అతని ప్రస్తావన తీసుకొని రాలేదంటూ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని థియేటర్స్ లో చూడకుండా బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ కూడా చేసారు. అయితే ఈ ట్రోల్ల్స్ ని చూసి వెంటనే స్పందించిన ‘డాకు మహారాజ్’ నిర్మాత నాగవంశీ ఒక ట్వీట్ వేసాడు. ఆ ట్వీట్ లో ఆయన మాట్లాడుతూ ‘ ఇది కేవలం నా సినిమా కాదు. మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ కచ్చితంగా కావాలి. అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా అందరం ప్రశాంతం ఉండి సంక్రాంత్కి మన సినిమాని భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని చేసుకుందాం’ అంటూ ఆయన ఎన్టీఆర్ అభిమానులను శాంతింపచేస్తూ ఒక ట్వీట్ వేసాడు.
ఇదంతా పక్కన పెడితే ఈ షో గురించి ఎవరికీ తెలియని మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే బాలయ్య ఎన్టీఆర్ గురించి కూడా అడిగాడని, ఆ షో డైరెక్టర్ BVS రవి ఆ షాట్ ని కత్తిరించాడని అంటున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా నందమూరి అభిమానుల మధ్య చీలిక వచ్చేలా బీవీఎస్ రవి ఇలా చేశాడంటూ సోషల్ మీడియా లో అతని పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీనిపై రవి స్పందిస్తాడో లేదో చూడాలి. ఒకవేళ అదే నిజమైతే బయట తిరగలేవు జాగ్రత్త అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీవీఎస్ రవి కి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ మోడ్ లో ఉన్నారు కాబట్టి ‘డాకు మహారాజ్’ మూవీ ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుందా?, ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి, ట్రెండ్ చాలా వీక్ గా ఉంది, రేపు విడుదలయ్యే థియేట్రికల్ ట్రైలర్ తర్వాత అయినా బుకింగ్స్ లో స్పీడ్ ఉంటుందేమో చూడాలి.