Juhi Chawla: సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువగా సంపాదిస్తారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్ లు చాలా తక్కువగా సంపాదిస్తారు. హీరోయిన్ లు ఇతర మెయిన్ లీడ్ ఆర్టిస్టులు కూడా తక్కువే తీసుకుంటారు. అయితే ఈ మధ్య హీరోయిన్లు కూడా కోట్లకు కోట్లు డిమాండ్ ఉంది. కోట్లలో వసూలు చేస్తున్నారు హీరోయిన్ లు. హీరోల లైఫ్ స్టైల్.. కెరీర్ తో పోల్చితే హీరోయిన్ల కెరీర్ చాలా షార్ట్ టైమ్ గా ఉంటుంది అనడం కూడా వాస్తవమే. చాలా తక్కువ మంది ఎక్కువ టైమ్ ఉంటారు. చాలా ఎక్కువ మంది త్వరగనే ఇండస్ట్రీలో ఫేడ్ ఔట్ అవుతుంటారు. ఇక త్రిష, నయనతార, సమంత లాంటి కొంతమంది మాత్రమే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.
ఇలా వారు సంపాదించే ఆస్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మిగిలిన వారు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోతుంటారు. ఇక కొంతమంది హీరోయిన్లు మాత్రం వచ్చి రెమ్యూనరేషన్లను ఇన్వెస్ట్ చేసుకుని బిజినెస్ లు చేస్తారు. కోట్లకు పడగలెత్తుతుంటారు. ప్రతీ హీరోయిన్ ఏదో ఒక రకంగా ఇతర రంగాల్లో ఫుల్ గా సంపాదిస్తుంటారు. రిచ్ హీరోయిన్లు అవుతుంటారు.
ఇలా సంపాదిస్తూ హీరోయిన్లందరిలో రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?అయితే వేల కోట్ల ఆస్తులు ఉన్న సీనియర్ తార ఎవరో కాదు ఆమె బాలీవుడ్ బ్యూటీ. అవును నిజమే అన్ని ఇండస్ట్రీల్లో ఓవరాల్ గా చూస్తే జూహీ చావ్లా ఎక్కువగా సంపాదించింది. అమితాబ్ బచ్చన్, షారుఖ్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు సంపాదించినట్టు ఈ బ్యూటీ కూడా అత్యధిక ఆస్తులు సంపాదించింది.
ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు 4000 కోట్లకు పైగా ఉంటుందట. జూహీ చావ్లా బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ పేరు సంపాదించింది. ఈమె స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్లో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ ఎక్కువ శాతం హిట్ అయ్యాయి. అందుకే ఈమెకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఇక ఈ హీరోయిన్ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరం అయింది.
ఇక మన దేశంలో ప్రతి ఏడాది సంపన్నుల జాబితాను వెల్లడిస్తుంది ఓ సంస్థ. అదే హురున్ ఇండియా సంస్థ. 2024లో విడుదల చేసిన జాబితాలో సంపన్న హీరోయిన్లలో జూహి చావ్లా ఫస్ట్ ప్లేస్ ను అందుకుంది. ఆమె ఆస్తులు రూ.4600 కోట్ల అని తెలిపింది ఈ సంస్థ. ఇక బాలీవుడ్ లో సంపన్న నటులలో 7300 కోట్లతో షారుఖ్ ఖాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. హీరోయిన్లలో జూహీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 2000 కోట్లతో హృతిక్, 12 00 కోట్లతో అమితాబ్ బచ్చన్ వరుస సంఖ్యలో నిలిచారు.