Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి క్లింకార పాప పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ కి ప్రతీ ఒక్కటి ఏ రేంజ్ లో కలిసి వస్తుందో మనమంత చూస్తూనే ఉన్నాం. క్లింకార ని కుటుంబ సభ్యులు మొత్తం ఆ దేవుడిచ్చిన వరం లాగా భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ రావడం, ఆ తర్వాత ఆయనకీ పద్మ విభూషణ్ అవార్డు రావడం, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం వంటివి జరగగా, పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలలో సంచలన విజయం సాధించి, ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టడం తో పాటు, జాతీయ స్థాయి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం వంటివి కూడా క్లింకార పుట్టిన తర్వాతనే జరిగింది. అదే విధంగా రామ్ చరణ్ కి ఆస్కార్ అవార్డ్స్ ద్వారా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు, ఆయనకీ గౌరవ డాక్టరేట్ కూడా లభించింది.
ఇక అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేషనల్ అవార్డు ని సంపాదించి, ఇప్పుడు పుష్ప 2 తో రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే రేంజ్ కి వెళ్ళిపోయాడు. అదే విధంగా వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి తో పెళ్లి జరగడం, త్వరలో వైష్ణవ్ తేజ్ కూడా పెళ్ళికి సిద్ధం అవ్వబోతున్నాడు. క్లింకార వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ లో ఇన్ని శుభాలు జరిగాయి. అందుకే క్లింకార ని ఆ కుటుంబం మొత్తం అదృష్ట దేవత గా భావిస్తుంటారు. అంతే కాదు ఆ పాప ని రామ్ చరణ్, ఉపాసన ఒక గాజు బొమ్మని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు. ముట్టుకుంటే కందిపోతుందేమో అనే స్థాయిలో ఆ పాపని పెంచుతున్నారు. ఇది వరకే క్లింకార కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చాలానే వచ్చాయి.
కానీ ఒక్క ఫోటోలో కూడా ఆ బిడ్డ ముఖాన్ని స్పష్టం గా చూపించలేదు. చిన్న పిల్లలకు నరదిష్ఠి ఎక్కువ తగులుతుంది అనే సెంటిమెంట్ చాలా మందిలో ఉంది. అందులో భాగంగానే క్లింకార ని ఇప్పటి వరకు స్పష్టంగా మీడియా కి చూపించలేదు అని అంటున్నారు అభిమానులు. రీసెంట్ గా ఉపాసన క్లింకార కి సంబంధించిన ఒక వీడియో ని అప్లోడ్ చేసింది. ఈ వీడియో లో ఆమె రామ్ చరణ్ #RRR మేకింగ్ వీడియో ని చూస్తూ అరుస్తూ ఉంటుంది. ఇదే ఆమె మొట్టమొదటిసారి తన తండ్రి లో టీవీ లో చూడడం అట. ఈ వీడియో లో కూడా క్లింకార ముఖాన్ని చూపించలేదు. ఆమె టీవీ చూస్తున్న సమయం లో ఈ వీడియో ని షూట్ చేసారు. వెనుక నుండి ఎవరో ‘హూ ఈజ్ థత్’ అని క్లింకార ని అడుగుతూ ఉంటారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.