Chalapathi Rao Jr. NTR : కొందరు నటులతో హీరోలకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కి చలపతిరావు అంటే వల్లమాలిన అభిమానం. ఎన్టీఆర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఆది మూవీలో చలపతిరావు కీలక రోల్ చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన హీరోకి అన్నీ తానై పెంచే బాబాయి పాత్ర చేశారు చలపతిరావు. బాబాయ్…బాబాయ్…. అంటూ ఎన్టీఆర్ చలపతిరావుని ఆ సినిమాలో పిలుచుకుంటాడు. ఇక చంటిపిల్లాడిలా ఎన్టీఆర్ ని చలపతిరావు ట్రీట్ చేస్తారు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఆది మంచి విజయం సాధించింది. తర్వాత ఎన్టీఆర్ నటించిన నరసింహుడు మూవీలో చలపతిరావు కీలక రోల్ చేశారు. ఎన్టీఆర్ పగ తీరేందుకు ఆత్మార్పణం చేస్తాడు.

అలా చలపతిరావుతో ఎన్టీఆర్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ చలపతిరావు చివరి చూపుకు నోచుకోలేకపోయారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో పాటు అమెరికాలో ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లడం జరిగింది. నేడు ఉదయం చలపతిరావు కన్నుమూశారన్న వార్త ఎన్టీఆర్ ని షాక్ కి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే రవిబాబుకు ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారు. చలపతిరావు పార్థీవ దేహం చూశారు. రవిబాబుతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
రవిబాబుతో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోతో చలపతిరావుపై ఎన్టీఆర్ కి ఎంతటి ప్రేమ ఉందో తెలిసొచ్చింది. చివరి చూపుకు చూడలేకపోయానన్న బాధ ఎన్టీఆర్ ని వెంటాడటం ఖాయం. అయితే దశదిన కర్మనాటికి ఎన్టీఆర్ అందుబాటులో ఉంటారని సమాచారం. కొన్నాళ్లుగా చలపతిరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వయసు సహకరించకపోవడంతో చలపతిరావు సినిమాలు చేయడం లేదు. ఇంటికే పరిమితం అవుతున్నారు.
ఓ షూట్ లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుండి ఆయన మరింత డల్ అయ్యారు. చలపతిరావు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. అమెరికా నుండి కూతుళ్లు వచ్చాక ఈ కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు. 1200ల చిత్రాల్లో నటించిన చలపతిరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చలపతిరావు దశాబ్దాల పాటు సేవలు అందించారు.
.@tarak9999 Video Call to Ravi Babu due to Sudden demise of #ChalapathiRao garu 🙂
May his soul Rest In Peace 🙏 pic.twitter.com/PuOmNfWOFi
— Dhanush🧛 (@Always_kaNTRi) December 25, 2022