https://oktelugu.com/

Jr NTR: ఎన్టీఆర్ కొడుకులు అప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయ్యారా… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో

ఎన్టీఆర్ రెండో కొడుకు పేరు భార్గవ్ రామ్. అభయ్ రామ్ వయసు 9 ఏళ్ళు కాగా భార్గవ్ రామ్ వయసు 5 ఏళ్ళు. శాకుంతలం మూవీలో బాల భరతుడు పాత్రకు అభయ్ రామ్ ని అనుకున్నాడట దర్శకుడు గుణశేఖర్.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 13, 2023 / 12:18 PM IST
    Follow us on

    Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ దీపావళి వేడుకల ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. భార్య పిల్లలతో ఆయన పండగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి ఫోటో దిగారు. ఎన్టీఆర్ ఇద్దరు కుమారులు ఆ ఫోటోలో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కొడుకులు అప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయ్యారా! అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ 2011లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. పెళ్ళైన మూడేళ్లకు కొడుకు పుట్టాడు. అభయ్ రామ్ అని నామకరణం చేశారు.

    మరో నాలుగేళ్ళ తర్వాత సెకండ్ చైల్డ్ ని ప్లాన్ చేశారు. 2018లో మరో కుమారుడు పెట్టాడు. ఎన్టీఆర్ రెండో కొడుకు పేరు భార్గవ్ రామ్. అభయ్ రామ్ వయసు 9 ఏళ్ళు కాగా భార్గవ్ రామ్ వయసు 5 ఏళ్ళు. శాకుంతలం మూవీలో బాల భరతుడు పాత్రకు అభయ్ రామ్ ని అనుకున్నాడట దర్శకుడు గుణశేఖర్. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం నేపథ్యంలో అభయ్ రామ్ ని నటింపజేయాలని కోరాడట. అయితే ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించాడట.

    ఎన్టీఆర్ తో గుణశేఖర్ రామాయణం చేసిన సంగతి తెలిసిందే. మరొక విశేషం ఏమిటంటే… ఎన్టీఆర్ విశ్వామిత్ర చిత్రంలో భరతుడు పాత్ర చేశాడు. కారణం తెలియదు కానీ అభయ్ రామ్ శాకుంతలంలో నటించేందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదట. దాంతో అల్లు అర్జున్ కుమార్తె తో ఆ పాత్ర చేయించారు. ఇద్దరు కొడుకులతో దీపావళి జరుపుకున్న ఆ ఫోటో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

    ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా దేవర షూటింగ్ ముగింపు దశకు వస్తుంది. వార్ 2 షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. విదేశాల్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నారు. వార్ 2 సెట్స్ లో ఎన్టీఆర్ ఇంకా జాయిన్ కాలేదు. వార్ 2 లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది.