Jr NTR Prashanth Neel Movie Updates: ఎన్టీఆర్(Junior NTR) అభిమానులు అత్యధిక శాతం మంది సోషల్ మీడియా ని వదిలి వెళ్లిపోయారు. ఎందుకంటే ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాలేదు. చాలా కాలం నుండి షూటింగ్ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ముందుకు వెళ్తుందా లేదా?, స్టోరీ వర్కౌట్ అవ్వడం లేదని కొందరు, రీ షూట్ చేస్తున్నారని మరికొందరు, ఇలా ఎవరికీ తోచినట్టు వాళ్ళు కథనాలు అల్లుకుంటూ ఉన్నారు. అసలు ఏమి జరుగుతుంది అనే సందిగ్దత అభిమానుల్లో తీవ్రస్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితి లో ఈ చిత్రం గురించి సోషల్ మీడియా లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది.
వివరాల్లోకి వెళ్తే రేపటి నుండి ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ మొదలు కానుంది. సుమారుగా మూడు వారాల వరకు ఈ షెడ్యూల్ ఉంటుందట. ఈ షెడ్యూల్ లో ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఎన్టీఆర్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తాడట. వాటితో పాటు ఒక పాటని కూడా షూట్ చేస్తారట. ఈ చిత్రాన్ని మొదట్లో కేవలం ఒక పార్ట్ లోనే షూట్ చేసి విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ రెండు భాగాలు డిమాండ్ చేసింది. దీంతో మొదటి భాగం మరియు సీక్వెల్ ని ఒకేసారి షూట్ చేసి మొదటి భాగాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. ముందుగా జూన్ నెలలో విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, షూటింగ్ బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడం తో డిసెంబర్ కి విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం విడుదలైన మూడు నెలల్లోనే రెండవ భాగాన్ని కూడా విడుదల చేస్తారట.
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో మొదలైంది. రెండు వారాల పాటు షూటింగ్ చేశారు. ఇక ఆ తర్వాత ఏకంగా ఆరు నెలల గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు మూడు వారాల భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తర్వాత ఇంకా ఎన్ని రోజుల గ్యాప్ ఇస్తారో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి చిన్న టీజర్ ని కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. న్యూ ఇయర్ సందర్భంగా లేదా సంక్రాంతి కానుకగా ఈ టీజర్ ని విడుదల చేస్తారట. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈ చిత్రం తో వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్ లోకి మా ఎన్టీఆర్ చేరిపోతాడు అనే ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్.