Jr NTR తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరసగా ఏడు విజయాలను సాధించి ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను తిరగరాస్తున్నాడు. ఇక రాబోయే సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకొని తన రికార్డును ఎవరు బ్రేక్ చేయలేని రేంజ్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటికే ఆయన హృతిక్ రోషన్ (Hruthik Roshan) తో కలిసి చేస్తున్న ‘వార్ 2’ (War 2) సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఎలా ఉంటుంది అనే విషయం పక్కన పెడితే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘డ్రాగన్ ‘ (Dragon) సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సైతం ఎన్టీఆర్ (NTR) కి ఒక టెస్ట్ అయితే పెట్టారట. 2000 మంది మధ్యలో ఒక ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సందర్భంలో వాళ్లందరి మధ్యలో ఎన్టీఆర్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉంటాడా? ఆయనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అనే ధోరణిలో ఆలోచించి ముందుగా తనను 2000 మంది మధ్యలో ఉంచి ఒక రోజు మొత్తం ప్రాక్టీస్ చేయించారట. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ గా తన పని తను చేసుకుంటూ ఉండటాన్ని గమనించిన ప్రశాంత్ నీల్ (Praahanth Neel) ఎన్టీఆర్ ఎనర్జీకి మెచ్చి రెండువేల మందితో ఫైట్ ని భారీ లెవెల్ లో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.
కొంతమంది హీరోలు ఎక్కువగా డూప్ లను వాడడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఇలాంటి సందర్భం వచ్చిన ప్రతిసారి స్టార్ హీరో డూప్ లను అయితే వాడుతుంటాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒక్కడే ఎలాంటి డూప్ లేకుండా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు 2000 మందితో ఫైట్ ని భారీ ఎత్తున చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఫైట్ షూట్ సమయం లో ఆయనకు రోప్ లు కట్టి లాగుతున్నప్పుడు చిన్నచిన్న గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ పెట్టిన టెస్టులో ఆయన సక్సెస్ అవ్వడమే కాకుండా డూప్ లేకుండా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ ని చేయడం చూసిన సినిమా యూనిట్ మొత్తం ఎన్టీఆర్ ఈ రేంజ్ లో కష్టపడతాడా అంటూ ముక్కున వేలేసుకున్నారట.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాతో అయిన జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. 2000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి వసూళ్లను సాధిస్తోంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…