Homeఎంటర్టైన్మెంట్NTR: ఎన్టీఆర్ విషయంలో ప్రతిసారి ఆ ఒక్క తప్పు జరగడానికి కారణం ఇదే...

NTR: ఎన్టీఆర్ విషయంలో ప్రతిసారి ఆ ఒక్క తప్పు జరగడానికి కారణం ఇదే…

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎనలేని గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్నారు. జూనియర్ […]

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎనలేని గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమాలో ఆయనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ తన ఎంటైర్ కెరియర్ లో ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి.

అయితే ఎన్టీఆర్ ప్రతి సినిమా విషయంలో ఒక తప్పైతే చేస్తున్నాడు అంటూ అతని అభిమానులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం తప్పు చేస్తున్నాడు ఎలాంటి తప్పులను చేస్తున్నాడు అంటే ఆయన ప్రతి సినిమాని ఎక్కువ హైప్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఆయన సినిమాలో పెద్దగా మేటర్ లేకపోవడంతో అవి చాలావరకు డీలా పడిపోతున్నాయి.

దాంతో ఆయన భారీ సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు. కలెక్షన్స్ విషయంలో కూడా వెనుకబడి పోతున్నాడు. ఇక ప్రతి సినిమా విషయంలో ఇదే తప్పు ఎందుకు జరుగుతుందనే విషయంలో ఆయన ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. సినిమా విడుదలకు ముందు భారీ హైప్ ను క్రియేట్ చేయడం వల్ల ఎన్టీఆర్ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ ని సాధించకపోవడంతో ప్రేక్షకులు నిరాశపడుతున్నారు. అందువల్ల ఆయన సినిమాని రిపీటెడ్ గా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడడం లేదు.

దానివల్ల సినిమా కలెక్షన్స్ డీలా పడిపోవడమే కాకుండా వాళ్ళకి భారీ ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది… ఇప్పటికైనా ఆయన చేసే సినిమాలా విషయంలో క్లారిటీని మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇక ఇంతకుముందు ఆయన వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్ లను సాధించాడు. కానీ అందులో ఈ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా మాత్రం కన్వర్ట్ కాలేకపోయాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper