Jr NTR : ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం ఏ రేంజ్ సెలెబ్రేషన్స్ మూడ్ లో ఉన్నారో ప్రత్యేకిచ్చి చెప్పనవసరం లేదు. #RRR చిత్రం తో గ్లోబల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, ఆ తర్వాత ‘దేవర’ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని అభిమానులకు మంచి కిక్ అందించాడు. థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీ లో కూడా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సుమారుగా 9 వారాలపాటు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది. అంతా బాగానే ఉంది కానీ, ఎన్టీఆర్ తన అభిమానులను ప్రత్యక్ష్యంగా కలుసుకొని చాలా రోజులైంది. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసారు. కానీ అసంఖ్యాకంగా అభిమానులు రావడంతో కంట్రోల్ చేయలేక పోలీసులు ఆ ఈవెంట్ ని రద్దు చేసారు. మళ్ళీ అలా అభిమానులతో మాట్లాడే అవకాశం ఎన్టీఆర్ కి రాలేదు.
దీంతో అభిమానులు నేరుగా ఎన్టీఆర్ ఉన్న ప్రదేశాలకు వెళ్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయం లో అభిమానులు ఎక్కువగా రావడంతో పోలీసులు జోక్యం చేసుకోవడం వారిపై లాఠీ ఛార్జ్ చేయడం, షూటింగ్ ని నిలిపేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. పరిస్థితులు చెయ్యి జారిపోయే ప్రమాదం ఉండడంతో ఎన్టీఆర్ కాసేపటి క్రితమే తన ఆఫీస్ నుండి ఒక ప్రకటనని విడుదల చేసాడు. ఈ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ‘అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానులకు ఈ జన్మ మొత్తం రుణపడి ఉంటాను. నన్ను కలిసేందుకు అభిమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు. దీనివల్ల సెక్యూరిటీ సమస్యలు వస్తున్నాయి. నాకు మాత్రమే కాకుండా, నాతోపాటు ఉండేవాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతున్నాయి. అందుకే త్వరలో అభిమానుల కోసం నేను ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. ఈ కార్యక్రమంలో మీ అందరితో నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతాను’.
‘ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించాలి కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సెక్యూరిటీ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆ కార్యక్రమాన్ని జరిపించాలి కాబట్టి, కాస్త సమయం పడుతుంది. కాబట్టి అభిమానులు కాస్త ఓర్పు వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2 ‘ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ముగియనుంది. ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల మీద అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.