Bigg Boss 9 Telugu Updates: గత కొద్దిరోజుల నుండి బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) కి సంబంధించిన ‘అగ్నిపరీక్ష'(Agnipareeksha) అనే ప్రోగ్రాం కి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 22వ తారీఖు నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ ప్రోగ్రాం కి సంబంధించి ఇప్పటికే అనేక ప్రోమోలు వచ్చాయి. త్వరలోనే మెయిన్ ప్రోమో రానుంది. ఈ అగ్నిపరీక్ష అనే ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం ఏంటో మన అందరికీ తెలిసిందే. సామాన్యులను బిగ్ బాస్ 9 సీజన్ లోకి పంపే ప్రక్రియ నే ఇది. వేల ధరఖాస్తులలో 200 మందిని సెలెక్ట్ చేసి, వారికి ఇంటర్వూస్, గ్రూప్ డిస్కషన్స్ వంటివి నిర్వహించి కేవలం 42 మందిని మాత్రమే అగ్నిపరీక్ష ప్రోగ్రాం కి ఎంపిక అయ్యారు. ఈ 42 మందికి బిగ్ బాస్ హౌస్ లో నిర్వహించే టాస్కుల కంటే కఠినమైన టాస్కులు నిర్వహించి కేవలం 15 మందిని ఎంపిక చేసి, వారి నుండి కేవలం 5 మందిని మాత్రమే హౌస్ లోపలకు పంపుతారు.
ఈ ప్రక్రియ కి సంబంధించిన షూటింగ్ నేటితో ముగియనుంది. ఈ షో కి శ్రీముఖి(Anchor Srimukhi) యాంకర్ గా వ్యవహరిస్తుండగా, అభిజీత్(Abhijeet), నవదీప్(Navdeep) మరియు బిందు మాధవి(Bindu Madhavi) వంటి వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. మనకి చూపించిన ప్రోమో లో చాలా ఫన్నీ గా సాగిపోయినట్టు కనిపిస్తుంది కానీ, షో మాత్రం అంత తేలికగా జరగలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ 15 మందిలో నిన్న ఇద్దరినీ ఎలిమినేట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు కూడా ప్రోమో లో హైలైట్ అయిన వారే. ప్రోమో లో బాగా బాడీ బిల్డింగ్ చేస్తూ, నేను ఆడ నవదీప్ ని అంటూ సమాధానం ఇచ్చిన శ్వేతా శెట్టి ని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ శ్వేతా శెట్టి అనే అమ్మాయి కేవలం బిగ్ బాస్ షో లో పాల్గొనడం కోసం UK నుండి ఇండియా కి వచ్చిందట.
Also Read: చిరంజీవి వాళ్ళను నమ్మి చిన్నప్పుడు రామ్ చరణ్ ను శబరి మలై కి పంపిస్తే ఏం చేశాడో తెలుసా..?
చాలా హుషారుగా టాస్కులు ఆడుతూ, అనేకసార్లు ఈమె కెప్టెన్ కూడా అయ్యిందట. అలాంటి ఆమె ఎందుకు ఎలిమినేట్ అయ్యిందో ఎపిసోడ్స్ చూస్తే కానీ అర్థం అవ్వదు. ఇక ప్రోమో చివర్లో కాళ్ళు లేని ప్రసన్న కుమార్ అనే వ్యక్తి కనిపిస్తాడు గుర్తుందా?, ట్రవెల్లెర్, ఫోటోగ్రాఫర్, బైక్ రైడర్, 21 కిలోమీటర్ల బ్లెడ్ మారథాన్ రన్నర్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఇతను కూడా ఎలిమినేట్ అయ్యినట్టు సమాచారం. అగ్నిపరీక్ష ఎపిసోడ్స్ ఇంకా ప్రసారం కాకముందే ఇతని పై జనాల్లో ఒక క్రేజ్ ఏర్పడింది. ఇతను హౌస్ లోకి వెళ్తే కచ్చితంగా టైటిల్ కొట్టేస్తాడు అంటూ అనేక మంది చెప్పుకొచ్చారు. బహుశా అతను హౌస్ లోకి వెళ్తే సింపతీ కారణంగా ఇతర కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది అనే కారణం చేత ఇతన్ని ఎలిమినేట్ చేసి ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ రెండు ఎలిమినేషన్స్ ని నెటిజెన్స్ అన్యాయంగానే భావిస్తున్నారు.