తెలుగు ప్రస్తుత స్టార్ హీరోల్లో ఎక్కువ విషయం ఉన్న హీరో అంటే ‘జూనియర్ ఎన్టీఆరే’. ఎన్టీఆర్ గత ఆరు సినిమాల నుండి వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు. కారణం కథలు, దర్శకులు కాదు. ఎన్టీఆర్ సెలెక్షన్ అండ్ ఎన్టీఆర్ నటన. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో తనకొచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలను ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాల తరువాత ఎన్టీఆర్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఎన్టీఆర్ ముందుచూపును మెచ్చుకొని తీరాలి. నిజంగా ఈ దర్శకుల సెలెక్షన్ చాల పర్ఫెక్ట్ గా ఉంది. అయితే తాజాగా అట్లీ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది.
లాస్ట్ వీక్ లో ఎన్టీఆర్ కు ఆన్ లైన్ ద్వారా అట్లీ ఒక కథ చెప్పాడట. కథ వెరీ ఎమోషనల్ లవ్ డ్రామా అని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో అట్లీ లవ్ డ్రామా అంటే కచ్చితంగా ఆసక్తి రెట్టింపు అవ్వడం ఖాయం. ఇక అట్లీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ కు బాగా నచ్చిందట. ఎలాగూ అట్లీ త్వరలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు.
షారుఖ్ చాల గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్నాడు కాబట్టి, ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ. అలాగే సినిమాలో మ్యాటర్ ఉంటుంది కాబట్టి, అట్లీకి బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ అండ్ మార్కెట్ పెరగడం ఖాయం. అంటే.. షారుఖ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అంటే.. ఇక ఆ సినిమాకి బాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది.
మొత్తమ్మీద ఏ రకంగా చూసుకున్నా ఎన్టీఆర్ సెలక్షన్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టే. కాకపోతే, ఎన్టీఆర్ – అట్లీ ఎమోషనల్ లవ్ డ్రామా మొదలు కావాలంటే ఇంకా రెండేళ్లు సమయం పట్టేలా ఉంది. 2023లో వీరి సినిమా స్టార్ట్ అవ్వొచ్చు.