
Jr Ntr – Nandamuri Taraka Ratna : తారకరత్న పార్ధివదేహాన్ని ఎన్టీఆర్ సందర్శించారు. సోదరుడు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న భౌతికకాయం చూసి ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీరు ఆపుకోలేకపోయారు.తారకరత్న భార్య అలేఖ్య, కూతురు నిష్కాలను ఓదార్చే ప్రయత్నం చేశారు. వారికి ధైర్యం చెప్పారు. బాబాయ్ కుమారుడైన తారకరత్న అంటే ఎన్టీఆర్ కి ప్రేమాభిమానాలు. వీరి మధ్య మంచి అనుబంధం ఉన్నట్లు సమాచారం. తారకరత్న అనారోగ్యానికి గురయ్యాడని తెలిసి ఎన్టీఆర్ హుటాహుటిన బెంగుళూరు వెళ్లారు. నారాయణ హృదయాల ఆసుపత్రిలో ఉన్న తారకరత్నను సందర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నాడు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్ తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుంది. ఆయన కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. డాక్టర్స్ చెప్పిన వివరాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. ఎన్టీఆర్ మాటలు విన్నాక అభిమానులు ఆనందంగా ఫీల్ అయ్యారు. తారకరత్న తిరిగి కోలుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు. రోజుల తరబడి ఆయనకు వైద్యం కొనసాగగా, కోలుకుంటారని అందరూ భావించారు. చివరకు శివరాత్రి పండుగనాడు తారకరత్న శివైక్యం అయ్యారు.
తారకరత్న మరణం ఎన్టీఆర్ ని దిగ్భ్రాంతికి గురి చేసింది. చలనం లేకుండా పడి ఉన్న తారకరత్న ను చూసి ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకున్నారు. కొంచెం అటూ ఇటుగా ఇద్దరూ ఏక కాలంలో సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్ సక్సెస్ అయినట్లు తారకరత్న కాలేకపోయారు. ఎన్టీఆర్ కి పోటీగా నందమూరి ఫ్యామిలీ తారకరత్నను రంగంలోకి దింపారనే వాదన కూడా ఉంది. ఈ కామెంట్స్ ని తారకరత్న ఓ ఇంటర్వ్యూలో ఖండించారు. తమ్ముడికి నేను ఎప్పుడూ పోటీ కాదని ఆయన వెల్లడించారు. వరుస పరాజయాలతో తారకరత్న ప్రభావం కోల్పోయారు. అయితే నటుడిగా వచ్చిన అవకాశాలు చేసుకుంటూ తన ప్రయాణం సాగిస్తున్నారు.
9 హౌర్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశారు. ఇది హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. పరిశ్రమలో తారకరత్నకు అజాతశత్రువు అనే పేరుంది. సౌమ్యుడు, మృదు స్వభావి అంటారు. ఇటీవల తారకరత్న రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతానని వెల్లడించారు. దీనిలో భాగంగా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. జనవరి 27న ప్రారంభ కార్యక్రమంలో తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యాడు.
https://www.youtube.com/watch?v=1B1ZpjWixJ0