NTR Dragon Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ పొజిషన్ లో నిల్చోబెట్టాయి. మాస్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేశాడు. దేవర సినిమాతో యావరేజ్ సక్సెస్ ని సాధించిన ఆయన పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని మాత్రం సృష్టించలేకపోయాడు. కారణం ఏదైనా కూడా ఆయన తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే తన తోటి హీరోలు వేల కోట్ల మార్కెట్లను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుంటే ఇంకా ఆయన 500 కోట్ల మార్కెట్ దగ్గరే ఆగిపోయాడు. ఇక ఇలాంటి క్రమంలో ప్రశాంత్ నీల్ తో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా సైతం ఆగిపోయిందనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ని ఒక రా లుక్ లో చూపిద్దామని ప్రశాంత్ నీల్ అనుకున్నాడట. కానీ ఎన్టీఆర్ మెకోవర్ అంత ఎఫెక్టివ్ గా లేకపోవడంతో తాత్కాలికంగా ఈ సినిమాని కొద్దిరోజులు నిలిపివేసి మరో లుక్కు లోకి ఆయన అరుణ తర్వాత సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ఇక ప్రశాంత్ నీల్ ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇంత అశ్రద్ధగా వ్యవహరిస్తున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ప్రశాంత్ నీల్ ను తలుచుకుంటే ఎన్టీఆర్ మెకోవర్ ను చాలా అద్భుతంగా తీర్చిదిద్ది వీలైనంత తొందరగా సినిమాను కంప్లీట్ చేయొచ్చు.
కానీ ఆయన కావాలనే ఈ సినిమాని లేట్ చేస్తున్నాడు అంటూ మరికొంతమంది చెబుతున్నారు. ఇప్పటివరకు తెరకెక్కించిన షూట్ మొత్తం చాలా అద్భుతంగా వచ్చిందట… కానీ ఎన్టీఆర్ మేకోవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటే ఆ సీన్స్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతాయనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
దానికి జూనియర్ ఎన్టీఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరొక లుక్ లో కనిపించబోతున్నాడట. మరి ఆ లుక్కు ఎలా ఉంటుంది ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…