
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR మూవీలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్-కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా సెట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు. నూక్లియర్ ప్లాంట్ పక్కనే కూర్చుంటే ఎలా ఉంటుందో తనకు తెలిసిందంటూ డైరెక్టర్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆయన ‘నూక్లియర్ ప్లాంట్’ అని ఊరకనే అనలేదని అందులో సినిమా టైటిల్ హింట్ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ‘న్యూక్లియర్’ టైటిల్ వైరల్ అయింది. అయితే తాజాగా మరో టైటిల్ తెరపైకి వచ్చింది.
ఎన్టీఆర్ కొత్త సినిమాకు ‘మిసైల్’ అనే టైటిల్ ఖరారైనట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది. ఎన్టీఆర్ తో మైత్రీ మూవీ మేకర్ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది. ప్యాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ నీల్ ఈ మూవీ నిర్మించబోతున్నాడు. దీంతో ఈ మూవీ టైటిల్ అన్ని భాషలకు సరిపోతుందని భావిస్తున్నారు. దీంతో ఈ మూవీ టైటిల్ ను మైత్రీ మూవీ సంస్థ ఫిలిం చాంబర్లో రిజస్టర్ చేయించారని టాక్ విన్పిస్తుంది. ‘న్యూక్లియర్’, ‘మిస్సైల్’ రెండు కూడా ఎన్టీఆర్ ఎనర్జీకి కరెక్ట్ గా సరిపోయేవీ. దీంతో ఈ రెండింటిలో ఏదో ఒకటి సినిమా టైటిల్ గా ఫిక్స్ అవడం ఖాయంగా కన్పిస్తుంది.
తాజాగా సినిమా షూటింగులకు అనుమతి లభించడంతో టాలీవుడ్లో సందడి మొదలైంది. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRRలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. కొమరంభీం పాత్రలో ఎన్టీఆర్ కన్పించబోతుండగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా కన్పించనున్నారు. బాలీవుడ్ భామ అలియాభట్, హాలీవుడ్ బ్యూటీ ఓలీవియా హీరోయిన్లు నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ మూవీ పూర్తయ్యాకే ఎన్టీఆర్ కేజీఎఫ్ డైరెక్టర్ తో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.