Manchu Lakshmi: సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి జర్నలిస్ట్ మూర్తి(VSN Murthy) పేరు తెలియకుండా ఉండదు. తన రివ్యూస్ తో , ఇంటర్వ్యూస్ తో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే పేరు ఈయనది. ఈయన చేసే కొన్ని ఇంటర్వ్యూస్ తీవ్రమైన వివాదాలకు దారి తీసినవి ఉన్నాయి, కొంతమంది సెలబ్రిటీలు ఇబ్బందుల్లో కూడా పడ్డారు. ఇక యూత్ ఆడియన్స్ అయితే ఈయన్ని వేరే లెవెల్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈయన కనిపించినప్పుడల్లా ‘తాత వచ్చాడే’ పాట ని ఉపయోగిస్తూ ఉంటారు నెటిజెన్స్. సినీ నిర్మాతలు కూడా తమ సినిమాకు కావాల్సిన రీచ్ రావడం కోసం మూర్తి తో కచ్చితంగా ఒక ఇంటర్వ్యూ ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంతటి పాపులర్ ఈయన. అయితే రీసెంట్ గా ఈయన మంచు లక్ష్మి(Manchu Lakshmi) తో ఇంటర్వ్యూ చేయడం ఈయన్ని సమస్యల్లోకి నెట్టేసింది. ఆమె ప్రధాన పాత్రలో దక్ష అనే చిత్రం చేసింది.
ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా మంచు లక్ష్మి మూర్తి కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో మూర్తి మంచు లక్ష్మి వేసుకున్న బట్టలపై కామెంట్స్ చేస్తాడు. ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలాంటి ప్రశ్న అడుగుతావ్ అని మంచు లక్ష్మి ఆ ఇంటర్వ్యూ లో ఫైర్ అవుతుంది. ఆ తర్వాత మామూలుగానే మాట్లాడుతుంది కానీ, ఒక రోజు గడిచిన తర్వాత మూర్తి పై కేసు వేస్తూ సోషల్ మీడియా లో ఒక లేఖ ని విడుదల చేసింది. ఇది పెద్ద సంచలనంగా మారింది. దీనిపై మూర్తి ఇన్ని రోజులు రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ, నిన్న ఆయన మంచు లక్ష్మి కి క్షమాపణలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జర్నలిస్ట్ మూర్తి ఎప్పుడూ ఇలా ఒకరికి క్షమాపణలు చెప్తూ వీడియోలు చేయడం జరగలేదు. దీనిని బట్టీ ఇంటర్నల్ గా ఆయనపై వచ్చిన ఒత్తిడిని అర్థం చేసుకోవచ్చు.
ఆ వీడియో లో మూర్తి మాట్లాడుతూ ‘నేను మీతో చేసిన ఇంటర్వ్యూ లో , నేను అడిగిన ఒక ప్రశ్న మీకు మనస్తాపాన్ని కలిగించి, చాలా బాధకు గురి చేసిందని నాకు తెలిసింది. ఈమేరకు యూనియన్ ద్వారా నాకు సమాచారం అందింది. ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అనే దాని గురించి చర్చించాలని అనుకోవడం లేదు. నాది ఎవరినీ బాధపెట్టే మనస్తత్వం కాదు కాబట్టి, నా వల్ల మీరు బాధపడ్డారు కాబట్టి క్షమాపణలు చెప్తున్నాను..ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
Journalist VSN Murthy says sorry to Actress #ManchuLakshmi!! pic.twitter.com/bvo3qYZ47h
— Movies4u Official (@Movies4u_Officl) October 10, 2025