https://oktelugu.com/

Jani Master: జానీ మాస్టర్ తన అసిస్టెంట్ తో పాటు మరి కొంతమంది హీరోయిన్లను కూడా లైంగికంగా వేధించాడా..? నిజమెంత.?

సినిమాల్లో హీరోలు చాలా బాగా డ్యాన్స్ వేస్తూ ప్రేక్షకులను అభిమానులను అలరిస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు అంత బాగా డ్యాన్స్ చేయడం వెనక కొరియోగ్రాఫర్స్ ఉంటారనే విషయం మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : September 23, 2024 / 10:43 AM IST

    Jani Master(3)

    Follow us on

    Jani Master: తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో జానీ మాస్టర్ ఒకరు. ఇటీవల అయన అసిస్టెంట్ తనని లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఆయన మీద కేసు పెట్టింది. జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్ మీద జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ విషయం మీద తన భార్య అయిన సుమలత అలియాస్ ఆయేషా తన భర్తని జానీ మాస్టర్ అసిస్టెంట్ అయిన శ్రేష్ఠ అనే అమ్మాయి మోసం చేసిందని చెప్పుకొచ్చింది. శ్రేష్ఠ తెలివితేటలను ప్రదర్శిస్తూ జానీ మాస్టర్ ను ఇరికించాలని ఒక ప్రణాళిక పరంగానే ఆయనను జైలకు పంపించారని మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. అలాగే ఈ కేసు వెనక పుష్ప సినిమాకు సంబంధించిన పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యారని వాళ్లందరికీ జానీ మాస్టర్ మీద కుట్ర ఉందని కూడా తను మాట్లాడింది. ఇక మొత్తానికైతే అసిస్టెంట్ శ్రేష్ట తన భర్తని లోబరుచుకుందని ఆ అమ్మాయికి చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోకుండా ఆమె జానీ మాస్టర్ ను పెళ్లి చేసుకోవాలని కూడా ప్రయత్నించిందని చెప్పింది. ఇక శ్రేష్ఠ వల్ల సుమలత ఆత్మహత్యయత్నం కూడా ప్రయత్నించిందని చెప్పింది.

    ఇక మొత్తానికైతే ఇందులో జానీ మాస్టర్ తప్పు ఏమీ లేదు. ఆయనను కుట్ర ప్రకారం ఇలా చేశారు ఆయన నిర్దోషిగా జైలు నుంచి బయటికి తిరిగి వస్తే వీళ్ళందరికీ బుద్ధి చెప్పినట్టుగా అవుతుంది అంటూ ఆమె మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…ఇక ఇదిలా ఉంటే జానీ మాస్టర్ వైఖరి ఇంతకుముందు కూడా సరిగ్గా లేదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆయన తన అసిస్టెంట్స్ నే కాకుండా మిగతా కొంతమంది హీరోయిన్లను కూడా లైంగికంగా వేధించినట్టుగా కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.

    మరి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయాలు బయటకు రావడం లేదు. కానీ జానీ మాస్టర్ మీద కేసు నమోదు అవ్వడంతో కొంతమంది బయటికి వచ్చి వారిని కూడా మాస్టర్ లైంగికంగా వేధించారంటూ చెబుతున్నారు. ఇక మొత్తానికైతే జానీ మాస్టర్ బాధితులు ఇంకా కొంతమంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వీళ్లంతా కూడా ఒకేసారి బయటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి జానీ మాస్టర్ నిర్దోషి అని ప్రూవ్ చేసుకొని బయటికి వస్తాడా లేదంటే దోషి గా తేలి జైలు శిక్ష అనుభవిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

    ఇక మొత్తానికైతే జానీ మాస్టర్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుందనే చెప్పాలి. ఇక ఇదంతా చూసిన సినీ పెద్దలు సైతం కొరియోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ కి వెళ్లిన జానీ మాస్టర్ రీసెంట్ గా ‘నేషనల్ అవార్డు’ ను కూడా అందుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొన్ని కేసుల పాలై జైల్లో ఇరుక్కోవడం అనేది ఆయన సినిమా కెరియర్ మీద చాలావరకు ఎఫెక్ట్ కనిపించే ప్రభావం కూడా ఉందని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…