Kotnak Jangu: గోండి భాష తెలంగాణలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. కొన్ని తెగలకు చెందిన గోండులు ఈ భాషను మాట్లాడతారు. ద్రవిడ భాషే దీనికి మూలం అయినా.. లిపి మాత్రం చాలాకాలం లేదు. తెలుగు, కన్నడకు దగ్గరగా ఉండే గోండి భాష నుంచే తెలుగు పుట్టిందని భాషావేత్తలు నిరాధరించారు. గోండుల్లో చాలా మందికి వారి గోండి భాష తప్ప వేరే భాష రాదు. ఇతర భాషలు వారికి అర్థం కడా కావు. గోండులతో సహవాసం చేసే కొలాం తెగకు చెందిన వారు మాత్రం కొలామీ భాషతోపాటు గోండి భాష కూడా మాట్లాడతారు. ప్రధాన్, తోటి, యురియా, ఓజా వంతి ఇతర గిరిజన తెగలకు గోండి మాతృభాష. గోండి భాషను మన దేశంతోపాటు ఆస్ట్రేలియాలోనూ మాట్లాడుతారు.
లిపి రూపొదించిన కొట్నాక్ జంగు..
పురాతనమైన గోండి భాషకు అక్షర రూపం తెచ్చాడు కొట్నాక్ జంగు(86). ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలానికి చెంది జంగు.. పూర్వీకుల నుంచి గోండి భాష నేర్చుకున్నాడు. దానికి లిపి తయారు చేశారు. గోండు చిన్నారుల కోసం గోండి, తెలుగు వాచకాలను ప్రచురించి విద్యాబోధన చేశాడు. ఒకటి నుంచి 3వ తరగతి వరకు గోండి లిపి పుస్తకాలు ముద్రించాడు. 2014లో గంజాలలో గోండి లిపికి సంబంధించిన అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆదివాసీ చిన్నారుల విద్యాభివృద్ధికి జంగు కృషి చేశాడు. ఆయన శ్రమను ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు గుర్తించి సహకరించారు.
అనారోగ్యంతో మృతి..
గోండి భాష అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న జంగు కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలనే ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గంజాలలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. ఇదిలా ఉంటే.. గోండి భాషను రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20 లక్షల మంది మాట్లాడుతున్నారు. గోండి భాషపై ఇది తెలంగాణ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో అధ్యయనం చేసిన ప్రొఫెసర్ తిరుమాల్‌రావు నేతృత్వలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం గాజాలకు వెళ్లి 1,750 మాన్యస్క్రిప్ట్‌ను గుర్తించింది. ఈ మాన్యుస్క్రిప్టు తెలియని లిపిలో రాయబడి ఉంది. దానికి వారు గుంజల గోండి అని పేరు పెట్టారు. గుంజల గోండిలో అనేక పుస్తకాలు అచ్చయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని పాఠవాలల్లో గోండి భాషలో పాఠాలు బోదిస్తున్నారు. ఈ గుంజల గోండిని గోండి లిపి లేదా కోయుతుర గుంజల లిపి అని పిస్తున్నారు.