Homeఎంటర్టైన్మెంట్ఆ మాస్టర్ తో పవన్ సినిమా.. కుదిరే పనేనా?

ఆ మాస్టర్ తో పవన్ సినిమా.. కుదిరే పనేనా?

అదిగో పులి.. అంటే ఇది తోక అన్నచందంగా కొన్ని గాసిప్స్ కథనాలు పుట్టుకొస్తున్నాయి. పవన్ కల్యాణ్ తో జానీ మాస్టర్ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్లో సర్కిల్స్ లో విన్పిస్తున్న కథనాలు కూడా ఈ కోవకు చెందినట్లే కన్పిస్తున్నాయి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం అటూ రాజకీయాల్లోనూ.. ఇటూ సినిమాల్లోనూ ప్రస్తుతం ఫుల్ బీజీగా ఉన్నాడు.

పవన్ కల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాక ఏ హీరో లేనంత బీజీగా మారిపోయాడు. వరుసగా నాలుగైదు సినిమాలకు కమిటై అభిమానుల్లో జోష్ నింపాడు. పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ వస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. కరోనా లేకుండా ఈపాటికే ‘వకీల్ సాబ్’ థియేటర్లో రిలీజయ్యేంది.

‘వకీల్ సాబ్’ సెట్స్ పై ఉండగానే పవన్ కల్యాణ్ డైరెక్టర్లు క్రిష్.. హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డిలతో మూవీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ నాలుగు సినిమాలు లైన్లో ఉండగా మలయాళం రీమేక్ ‘అప్ప‌ప్ప‌యుమ్ కోషియ‌మ్’ మధ్యలో వచ్చి చేరింది. ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ చేయబోయే మూవీ ‘అప్ప‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌’ అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మినహా ఏ మూవీలు ఇంకా సైట్స్ పైకి వెళ్లనేలేదు. అప్పుడే పవన్ కల్యాన్ మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడనే వార్తలు విన్పిస్తున్నాయి. డాన్స్ మాస్టర్ జానీకి ఎప్పటి నుంచో మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉంది. ఈక్రమంలోనే జానీ మాస్టర్ తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ తో తొలి మూవీ చేయాలని భావిస్తున్నాడు.

ఇందుకోసం జానీ మాస్టర్ పవన్ కల్యాణ్ ను కలిసి తన కోరికను వెల్లడించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లక ముందు నుంచే జానీ మాస్టర్ ఆయనతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. పవన్ కల్యాణ్ కోసం ఎన్నిరోజులైనా జానీ మాస్టర్ వెయిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ తోనే తొలి సినిమా తీయాలనే సంకల్పంతో జానీ మాస్టర్ ఉన్నారట. దీంతో పవన్ సైతం జానీ మాస్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పలు సినిమాలతో బీజీగా ఉన్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లలో మూవీ ఎప్పటికీ సైట్స్ పైకి వెళుతుందోనేది ఆసక్తికరంగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version