Jhanvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె గా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Jhanvi Kapoor) కి బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా లేదంటే నమ్ముతారా?, ఈమె మొట్టమొదటిసారి సక్సెస్ చూసింది మన తెలుగు సినిమా అయినటువంటి ‘దేవర'(Devara Movie) తోనే. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వగానే ఆమె రామ్ చరణ్(Global Star Ram Charan) ‘పెద్ది'(Peddi Movie) చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా గ్లింప్స్ వీడియో ని చూసిన తర్వాత ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సిక్సర్ కొడుతోంది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అలా బాలీవుడ్ లో రానటువంటి సక్సెస్, ఈమెకు మన టాలీవుడ్ లో దక్కింది. అయినప్పటికీ ఈమె బాలీవుడ్ ని పూర్తిగా వదిలేయలేదు, అక్కడ కూడా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.
Also Read : హిట్ 3′ సూపర్ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టలో తెలుసా..? నాని కి అగ్నిపరీక్ష!
సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే జాన్వీ కపూర్, రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కియారా అద్వానీ భర్త, బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా(Siddarth Malhotra) తో కలిసి ఆమె స్కూటీ లో షికార్లు కొడుతూ అప్లోడ్ చేసిన ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి. పెళ్ళైన అబ్బాయితో జాన్వీ కపూర్ కి షికార్లు ఏమిటి ?,తప్పు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది రియల్ లైవ్ ఫోటోలు కాదు, రీల్ లైఫ్ ఫోటోలు. వీళ్లిద్దరు కలిసి ఇప్పుడు ‘పరమ్ సుందర్’ అనే చిత్రం లో హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. నేడు వీళ్లిద్దరు ఇలా స్కూటీ లో కలిసి ప్రయాణిస్తూ షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారట. ఈ పోస్ట్ కి దాదాపుగా 16 లక్షల లైక్స్ వచ్చాయి.
ఆన్ స్క్రీన్ మీద మీ జంట అదిరిపోతాది, చూసేందుకు ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ ఈ పోస్టు క్రింద కామెంట్స్ తో నింపేశారు నెటిజెన్స్. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, ఈ ఏడాది ద్వితీయార్థం లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కనీసం ఈ చిత్రంతో అయినా బాలీవుడ్ లో జాన్వీ కపూర్ బోణీ కొడుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే, ఇక శాశ్వతంగా ఆమె హైదరాబాద్ కి వచ్చేయొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ‘పెద్ది’ చిత్రం లో ఈమెకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికిందట. ఈమె పుట్టిన రోజు నాడు ఒక పోస్టర్ ని కూడా మేకర్స్ విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. రేయింబవళ్లు ఎప్పుడు డేట్స్ అడిగినా ఇచ్చి, చాలా డెడికేషన్ తో ఈ సినిమా కోసం పని చేస్తుందట జాన్వీ కపూర్.